AP: రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాలు, తద్వారా సంభవిస్తున్న మరణాలను తగ్గించేందుకు కఠిన చర్యలు తీసుకోవాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. రోడ్ సేఫ్టీ కౌన్సిల్‌తో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు.
ఈ ఏడాది ఇప్పటివరకు రాష్ట్రంలో “15,462 రోడ్డు ప్రమాదాలు”, “6,433 మరణాలు” సంభవించినట్లు డీజీపీ హరీశ్‌కుమార్ గుప్తా, రవాణా కమిషనర్ మనీశ్ కుమార్ సిన్హా సమావేశంలో వెల్లడించారు. నెల్లూరు, తిరుపతి, పల్నాడు జిల్లాల్లో ప్రమాదాల సంఖ్య ఎక్కువగా నమోదైనట్లు అధికారులు తెలిపారు.
ప్రతి ప్రమాదంపై తప్పనిసరిగా “థర్డ్ పార్టీ ఆడిట్” చేయించాలని సీఎం ఆదేశించారు. ప్రమాదానికి కారణమైన లోపాలను గుర్తించి, వాటిని సవరించడంపై దృష్టి పెట్టాలని సూచించారు.
ALSO READ:Telangana Highway Tourism Plan | తెలంగాణ రైజింగ్ విజన్-2047లో కొత్త ప్రతిపాదనలు
అతివేగం నియంత్రణలో భాగంగా “స్పీడ్ గవర్నర్లు”, “సీసీ కెమెరాలు” తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని అన్నారు. గుంతలు లేకుండా ఉన్న రహదారులే ప్రభుత్వ తొలి ప్రాధాన్యత అని సీఎం స్పష్టం చేశారు.
ప్రైవేటు బస్సుల్లో నిబంధనల ఉల్లంఘన తీవ్రతరమైందని గుర్తించిన ప్రభుత్వం, వాటిపై “కఠిన చర్యలు” తీసుకోవాలని ఆదేశించింది. డ్రైవర్ల నియామకం, వాహనాల సాంకేతిక తనిఖీలు, నైట్ డ్రైవింగ్ నియంత్రణ వంటి అంశాలపై అధికారులు అదనపు చర్యలు తీసుకోవాలని సీఎం సూచించారు.
రోడ్డు ప్రమాదాల నివారణ కోసం ప్రతి శాఖ సమన్వయంతో పని చేయాలని సమావేశం నిర్ణయించింది.
