టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ తన 36వ పుట్టినరోజు (నవంబర్ 5) జరుపుకుంటున్నాడు. ఈ సందర్భంగా భార్య, బాలీవుడ్ నటి అనుష్క శర్మ ఒక అందమైన ఫొటోను అభిమానులతో పంచుకుంది. ఇందులో విరాట్ తన ఇద్దరు పిల్లల్ని ఎత్తుకుని నవ్వుతుంటాడు. కొడుకు అకాయ్‌ను క్యారియర్‌లో పట్టుకోగా, కూతురు వామికను మరో చేత్తో ఎత్తుకొని ఉన్నాడు. పిల్లల ముఖాలను హార్ట్ ఎమోజీలతో కవర్ చేసింది.
ఈ ఫొటో గార్డెన్‌లో పిల్లలతో ఆడుకుంటున్న సమయంలో తీసినట్టు అనుష్క తెలిపింది. ఫొటోలో విరాట్ వైట్ టీ షర్ట్, బ్రౌన్ జీన్స్ ధరించి ఉన్నాడు. వామిక రెండు జడలతో జీన్స్, టీ షర్ట్‌లో ఉన్నా, అకాయ్ సైతం టీ షర్ట్‌లో ముద్దుగా కనిపించాడు. ఈ ఫొటో అభిమానుల హృదయాలను హత్తుకుంది, కేవలం నిమిషాల్లోనే సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
“వామిక, అకాయ్ ఎంత ఎదిగిపోయారు!” అంటూ ఒక అభిమాని వ్యాఖ్యానించాడు. “కోహ్లీ పుట్టినరోజు రోజు ఇంతకంటే ప్రత్యేకమైన బహుమతి ఏమీలేదు” అంటూ మరొకరు ప్రశంసించారు.