శ్రీ ఆర్.పి. సింగ్ (ఆంధ్రప్రదేశ్ హిందూ వాహిని రాష్ట్ర అధ్యక్షుడు), శ్రీ రాజు సింగ్ (రాష్ట్ర కార్యదర్శి), శ్రీ సంతోష్ సింగ్, శ్రీ లలిత్ గౌర్, శ్రీ గౌతమ్ దాస్, శ్రీ జయ రాజు, శ్రీ వీపాల్ సింగ్, నరేంద్ర శర్మ, వినోద్ సింగ్, ప్రవీణ్ సోలంకి, మోహన్ శేఖర్, అప్పన్న కుమార్, సోను బాబు, మోహన్ తదితరులు హిందూ వాహిని ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమం శ్రీ యోగి ఆదిత్యనాథ్ మార్గదర్శకత్వంలో, ఢిల్లీ హిందూ వాహిని సీనియర్ నాయకుల సమక్షంలో నిర్వహించారు.
ఈ సందర్భంగా హిందూ వాహిని ఆంధ్రప్రదేశ్ ముఖ్య ఉద్దేశ్యాలను ప్రకటించారు. ముఖ్యంగా దేవాలయాలను రక్షించడం, గో సంరక్షణ చేపట్టడం, మత మార్పిళ్లను నిరోధించడం, హిందూ మహిళలను ప్రేమ జిహాదీ అగర్తల నుండి రక్షించడం తదితర అంశాలపై చర్చ జరిగింది. హిందూ సంప్రదాయాల పరిరక్షణ కోసం ప్రత్యేక కార్యక్రమాలను చేపట్టాలని నిర్ణయించుకున్నారు.
హిందూ వాహినిలో సభ్యత్వం కలిగి ఉన్నవారికి, రాష్ట్ర అధ్యక్షుడు ఆర్.పి. సింగ్, రాష్ట్ర కార్యదర్శి రాజు సింగ్ రాష్ట్ర మరియు జిల్లా స్థాయి సభ్యులకు గుర్తింపు సర్టిఫికేట్ మరియు ఐడి కార్డులను జారీ చేశారు. ఈ కార్యక్రమంలో హిందూ సమాజ రక్షణకు తమ పూర్తి సహకారం అందిస్తామని నాయకులు స్పష్టం చేశారు.
ప్రెస్ మీట్ అనంతరం హిందూ వాహిని సభ్యులు కొన్ని కార్యక్రమాలను అమలు చేసేందుకు ముందడుగు వేశారు. దేవాలయాల సమీపంలో మాంసం దుకాణాలు, వైన్ షాపులు లేకుండా చూడాలని, హిందూ సంప్రదాయాలను కాపాడే కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమానికి రాష్ట్రవ్యాప్తంగా అనేక మంది హాజరై సంఘీభావం తెలిపారు.