తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పర్యాటక, భాషా, సంస్కృతి శాఖల సౌజన్యంతో ఆనంద భైరవి సాంస్కృతిక సాంఘిక సేవా సంస్థ 13వ వార్షికోత్సవాన్ని రవీంద్రభారతిలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని సినీ నేపథ్య గాయని శ్రీమతి శారదా సాయి సమర్పించారు.
ఈ వేడుకలో గౌరవ అతిథిగా కార్డు బాక్స్ కంపెనీ, ఆప్ సెట్ ప్రింటింగ్ మేనేజింగ్ పార్ట్నర్ భీమ్ రెడ్డి పాల్గొన్నారు. ముఖ్య అతిథులుగా ప్రముఖ సినీ గేయ రచయిత జొన్నవిత్తుల రామలింగేశ్వర్, గ్రీన్ మెట్రో ఇన్ఫోటెక్ హ్యాండ్ ప్రాజెక్ట్ లిమిటెడ్ చైర్మన్ బొడ్డు అశోక్, ఆకెళ్ల రాఘవేంద్ర హాజరయ్యారు.
సాంస్కృతిక కార్యక్రమంలో సినీ గాయకులు శ్రీకృష్ణ, శ్రీరాము సహా పలువురు గాయకులు తమ గాత్రంతో మురిపించారు. సినీ సంగీత ప్రియులు, అభిమానులు పెద్ద సంఖ్యలో హాజరై ఈ వేడుకను ఆహ్లాదకరంగా ఆస్వాదించారు.
ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి నిర్వాహకుల కృషిని అతిథులు ప్రశంసించారు. భారతీయ సాంస్కృతిక మూలాలను ప్రోత్సహించేందుకు ఆనంద భైరవి సంస్థ చేస్తున్న కృషిని పలువురు అభినందించారు.
