మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ సతీమణి అమృత ఫడ్నవీస్ మంగళవారం ముంబయిలో జరిగిన టాటా ముంబయి మారథాన్‌లో పాల్గొన్నారు. స్పోర్ట్స్ డ్రెస్సులో వచ్చిన ఆమె, నిర్వాహకులు, ఇతర మారథాన్ ఔత్సాహికులతో కలిసి ఉత్సాహంగా గడిపారు. అక్కడి అనుభూతులను వీడియో రూపంలో తన ఎక్స్ (ట్విట్టర్) ఖాతాలో పంచుకున్నారు.
ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ సందర్భంగా అమృత ఫడ్నవీస్ మాట్లాడుతూ, “డ్రీమ్ రన్ ప్రారంభించడం నాకు గర్వంగా ఉంది. ఈ మారథాన్ 20 ఏళ్లుగా ప్రజలను ఏకం చేస్తూ, సమాజ సేవకు ఓ వేదికగా నిలుస్తోంది” అని తెలిపారు. రన్నింగ్ క్రీడను ప్రోత్సహించడంతో పాటు, సోదరభావాన్ని పెంచే కార్యక్రమమని ఆమె పేర్కొన్నారు.
అమృత మారథాన్‌లో పాల్గొన్న ఫొటోలు, వీడియోలు వైరల్ అవుతుండగా, చాలా మంది నెటిజన్లు ఆమెను ప్రశంసిస్తున్నారు. మారథాన్ లో పాల్గొన్న అనుభవాన్ని ఆమె ఉత్సాహంగా వివరించారు. ప్రజలకు రన్నింగ్ ద్వారా ఆరోగ్యాన్ని పెంపొందించే సందేశాన్ని అందజేశారు.
నటి, గాయని, సామాజిక కార్యకర్తగా రాణిస్తున్న అమృత ఫడ్నవీస్, మారాఠీ చిత్రాలలో నటించడమే కాకుండా, తన గానం ద్వారా సంగీత ప్రపంచంలో ప్రత్యేక గుర్తింపు పొందారు. మారథాన్‌లో పాల్గొని ప్రజలకు ప్రేరణగా నిలిచిన ఆమెను అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.