దావోస్ పర్యటనపై అంబటి రాంబాబు తీవ్ర విమర్శ

Ambati Rambabu criticized Chandrababu’s Davos visit, stating the government should explain the results of the trip to the public and emphasized the government's failure. Ambati Rambabu criticized Chandrababu’s Davos visit, stating the government should explain the results of the trip to the public and emphasized the government's failure.

విశాఖ ఎయిర్పోర్టుకు చేరుకున్న మాజీ మంత్రి అంబటి రాంబాబుకు వైసీపీ నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. అంబటి రాంబాబు చందరబాబు దావోస్ పర్యటనపై తన ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. “దావోస్ పర్యటనలో ఎన్ని పెట్టుబడులు, కంపెనీలు తీసుకొచ్చారో ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉందని” ఆయన పేర్కొన్నారు.

అంబటి రాంబాబు వివరిస్తూ, “హైదరాబాద్‌ను అభివృద్ధి చేశానని డబ్బా కొట్టుకున్న చంద్రబాబు, దావోస్ వెళ్లి ఒక్క ఫలితమైనా తీసుకొచ్చారా? ఆయన చేసిన పర్యటన సున్నా” అని ఆరోపించారు. “ఇది మా గుంటూరులో చెప్పే సామెత కంటే వేరే ఏమి కాదంటే, ‘డొంక్క ఈతకి లంక మేతకి’ అన్నట్టుగా ఉంది” అని చెప్పారు.

అంబటి రాంబాబు ఇంకా చెబుతూ, “ఒక మంత్రి దావోస్ వెళ్లి రెడ్ బుక్ కోసం మాట్లాడుతున్నారు, అదే దావోస్ పర్యటన. పరిశ్రమల కోసం మాట్లాడకుండా, లోకేష్ ముఖ్యమంత్రి కావాలని మాట్లాడుతున్నారు” అని మండిపడారు. “ఈ కూటమి ప్రభుత్వం ఏడు నెలలలోనే బండారం బయట పడింది” అని వ్యాఖ్యానించారు.

అంబటి రాంబాబు విశాఖపట్నం గురించి మాట్లాడుతూ, “హైదరాబాద్ తర్వాత సహజ వనరులు ఉన్న విశాఖపట్నం అభివృద్ధి చెందుతుందనే నమ్మకం ఉంది. రాజశేఖర్ రెడ్డి కాలంలో విశాఖపట్నంను ఐటీ హాబ్ గా అభివృద్ధి చేసేందుకు ప్రయత్నించారు” అని అన్నారు. “అయినా, అమరావతిని ఎంత అభివృద్ధి చేసినా, వరదలు మాత్రమే అవి చేయగలవు” అని సూటిగా చెప్పారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *