బొప్పాయి పండ్లలో ఉన్న పోషకాలు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. అయితే, ఈ పండ్ల గుజ్జు చర్మంపై ఉపయోగిస్తే మరిన్ని అద్భుతమైన ప్రయోజనాలు లభిస్తాయి. బొప్పాయి గుజ్జులో పపైన్ అనే ఎంజైమ్ ఉంటుంది, ఇది చర్మంలోని మృత కణాలను తొలగించి, మొటిమలను తగ్గించడంలో సహాయపడుతుంది. తద్వారా చర్మం సాఫ్టుగా మరియు నిగనిగలాడేలా మారుతుంది.
బొప్పాయిలో లైకోపీన్ అనే యాంటీ ఆక్సిడెంట్ అధికంగా ఉండడం వల్ల, ఇది చర్మంలో ఫ్రీర్యాడికల్స్ ను తొలగించి, ముడతలు పడకుండా నిరోధిస్తుంది. ఈ విధంగా, బొప్పాయి గుజ్జు చర్మాన్ని నిగనిగలాడేలా చేస్తుంది మరియు వయోసహజంగా వచ్చే ముడతలను అడ్డుకుంటుంది. ఈ గుణం చర్మం యొక్క ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.
బొప్పాయి గుజ్జు లేదా రసంతో చర్మంపై మసాజ్ చేస్తే, చర్మం లోపలి పొరల వరకు ప్రభావితం అవుతుంది. బొప్పాయి గుజ్జు లోపల నిల్వ ఉన్న నీరు చర్మాన్ని తడిగా ఉంచి, ఆరు పడి పోకుండా చేస్తుంది. ఇది కేవలం చర్మాన్ని తడిగా కాకుండా, నిగనిగలాడేలా కూడా ఉంచుతుంది.
ముఖంపై సన్నని వెంట్రుకలు ఉండటం చాలా మహిళలకు సమసి. అయితే, బొప్పాయి గుజ్జు వీటిని తొలగించడంలో సహాయపడుతుంది. బొప్పాయిలోని కొన్ని ఎంజైమ్‌లు సన్నని వెంట్రుకల కుదుళ్లను బలహీనం చేస్తాయి, తద్వారా మళ్ళీ అవి పెరగకుండా నిరోధిస్తాయి.