అమలాపురం రూరల్ మండలం ఈదరపల్లి శివారు వైకుంఠపురానికి చెందిన మనోజ్ కుమార్, కెనడాలో ఉద్యోగం చేస్తున్నాడు. అక్కడ సహ ఉద్యోగినిగా ఉన్న ట్రేసీ రోచేడాన్ తో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం క్రమంగా ప్రేమగా మారి, ఇద్దరూ కెనడాలో సంప్రదాయం ప్రకారం వివాహం చేసుకున్నారు.
ఇప్పుడు ఈ కొత్త జంట అమలాపురానికి చేరుకుంది. ఇక్కడ తమ కుటుంబ సభ్యులు, బంధుమిత్రులతో కలిసి సంప్రదాయ ప్రకారం మరొకసారి పెళ్లి చేసుకోవాలని నిర్ణయించారు. సోమవారం నుండి వివాహం కోసం ఏర్పాట్లు మొదలవడంతో ఆ ఇంట్లో ఆనందోత్సాహం వెల్లివిరుస్తోంది.