జడ్డంగి బ్యాంక్ అఫ్ ఇండియా శాఖలో కస్టమర్ దేవుళ్ళకు నేటి నుండి అన్ని రకాల లోన్లు,సేవలు అందుబాటులో ఉంటాయని విశాఖపట్నం డిప్యూటీ జోనల్ మేనేజర్ ఎన్.సీతారామ్ మీడియాకి తెలిపారు.అల్లూరి సీతారామరాజు జిల్లా రాజవొమ్మంగి మండలం జడ్డంగిలో బ్యాంకు అఫ్ ఇండియా శాఖ నూతన భవనాన్ని ఆయన ముఖ్య అతిధిగా విచ్చేసి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు.ఈ సందర్బంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ జోనల్ మేనేజర్ కె.శ్రీనివాస్ కృషితో బ్యాంకుకి అన్ని రకాల సదుపాయాలు త్వరగా ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు.నేటి నుండి జడ్డంగి శాఖలో అన్ని రకాల సేవలు అందుబాటులో ఉంటాయని వినియోగదారులు సద్వినియోగం చేసికోవాలని కోరారు.అలాగే నూతనంగా మద్యం లైసెన్సులు పొందిన వారికి 10 శాతం మార్జిన్ మనీతో బ్యాంకు గ్యారంటీ ఇవ్వడం జరుగుతుందని అన్నారు.10 రూపాయల నాణెంలు చలామణిలో ఉన్నాయని,దుష్ప్రచారం నమ్మవద్దని కోరారు.బ్రాంచ్ ముందుంజలో నడవడానికి కృషి చేస్తున్న మేనేజర్ కొప్పిశెట్టి అరుణ్ కుమార్ మరియు సిబ్బందిని అయన అభినందించారు.దేశంలో ఉన్న 69 జోన్లలో విశాఖపట్నం జోన్ ప్రధమ స్థానంలో ఉందని అన్నారు.ఈ కార్యక్రమంలో జోనల్ సెక్యూరిటీ ఆఫీసర్ జగదీషుతో పాటు పలువురు పాల్గొన్నారు.
జడ్డంగి బ్యాంక్ అఫ్ ఇండియా శాఖలో అన్ని రకాల లోన్లు అందుబాటులో
