ఏపీ భవన నిర్మాణ కార్మిక సంఘం పిలుపుమేరకు నంద్యాల జిల్లా కార్యాలయం దగ్గర ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు రఘురాంమూర్తి అధ్యక్షతన భవన నిర్మాణ కార్మికుల సమస్యలపై ధర్నా నిర్వహించడం జరిగింది.
ఏఐటీయూసీ జిల్లా ఉపాధ్యక్షులు కె ప్రసాద్ ఏఐటీయూసీ జిల్లా ఆర్గనైజేషన్ కార్యదర్శి బాలకృష్ణ ఏఐటీయూసీ పట్టణ కార్యదర్శి డి శ్రీనివాసులు హాజరైనారు.
అనంతరం ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి పి సుంకయ్య మాట్లాడుతూ మన రాష్ట్రంలో ఉన్న అసంఘటిత రంగ కార్మికులకు సంక్షేమ చట్టం ఏర్పాటు చేయాలని ఏఐటియుసి ఆధ్వర్యంలో అనేక సంవత్సరాలుగా పోరాట ఫలితంగా 1996న ఒక భవన నిర్మాణ కార్మికులకు సంక్షేమ చట్టం ఏర్పాటు చేయాలని ప్రతిపాదించడం జరిగింది. తరువాత 2009లో ఆ చట్టం రూపకల్పన చేసి కార్మికులకు లేబర్ ఆఫీసుల ద్వారా గుర్తింపు కార్డులు జారీ చేయడం జరిగింది. నిర్మాణరంగం నుండి ఒక శాతం శేషు ద్వారా వసూలు చేసిన నిధులను ఈ సంక్షేమ బోర్డు కు జమ చేయాలని ఆ డబ్బులను ఒక భవన నిర్మాణ కార్మికుల అవసరానికే ఉపయోగించాలని ఆ రోజు తీర్మానాలు చేసి నిధులు సమకూర్చడం జరిగింది కానీ వైయస్సార్ సిపి ప్రభుత్వం ఆ నిధులను పూర్తిగా వాడుకుని కార్మికులకు అన్యాయం చేసింది ఇప్పుడు వచ్చిన టిడిపి ప్రభుత్వం ఆ బోర్డును మరలా ప్రారంభించి కార్మికుల పెండింగ్ లో ఉన్న అన్ని రకాల బెనిఫిట్ లను అందివ్వాలని అన్నారు అలాగే ఇసుక త్రవ్వకం ప్రైవేటు ఏజెంట్లకు ఇవ్వడం నిలిపివేయాలి ప్రభుత్వమే ఇసుక ర్యాంపులు నడపాలి ఇసుకపై అన్ని రకాల పన్నులు ఎత్తివేయాలి భవన నిర్మాణ సంక్షేమ బోర్డును ప్రారంభించాలి. పెండింగ్లో ఉన్న 42 వేల క్లైమ్బ్స్ లకు నిధులు మంజూరు చేయాలి. కార్మిక సంక్షేమ బోర్డు నుండి గతంలో దారి మళ్లించిన నిధులను బోర్డుకి జమ చేయాలి ఇతర రాష్ట్రాల తరహాలో ఆంధ్రప్రదేశ్ సంక్షేమ బోర్డు చట్టం 1996 ను నిర్వహించాలి సిమెంటు ఐరన్ కలప ఎలక్ట్రికల్ పెయింట్స్ స్టోర్స్ లాంటి గృహపరాణాల ధరలు నియంత్రణ చేయాలి ఇలా అనేక సమస్యలపై ఈరోజు నంద్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయం దగ్గర ధర్నా నిర్వహించడం జరిగిందని అన్నారు.
ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ. భవన నిర్మాణ కార్మికులు సుధాకర్ నాయుడు. నజీర్. మా భాష. మధుబాబు. మహానంది. నాగరాజు. రమేష్. ఆనందు. తదితరులు పాల్గొన్నారు..