ఆదివాసి హక్కుల పోరాట సమితి తుడుందేబ్బ, అనుబంధ సంఘాల ఆధ్వర్యంలో ఆదిలాబాద్ కలెక్టరేట్ ఎదుట టెంట్ వేసుకొని నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా తుడుందెబ్బ అధ్యక్షుడు గోడం గణేష్ మాట్లాడుతూ.. ఎలాంటి షరతులు విధించకుండా రైతులందరికీ రుణమాఫీ వేంటనే చేయాలన్నారు. రైతులందరికీ కటాప్ లేకుండా రైతు భరోసా వేంటనే ఇవ్వాని క్వింటాల్ పత్తికి మద్దతు ధర పదివేల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.
ఆదిలాబాద్ కలెక్టరేట్ ఎదుట తుడుందెబ్బ ఆధ్వర్యంలో చేపట్టిన ధర్నా కాస్త ఉద్రిక్తతకు దారితీసింది. ధర్నా అనంతరం కలెక్టరేట్ లోపలికి వెళ్లేందుకు యత్నించగా గేటు మూసి వేశారు. కలెక్టరేట్ కు ఉన్న మరో గేటు నుండి వారు లోపలికి వెళ్లేందుకు యత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. డిఎస్పీ, సీఐలు సిబ్బంది అడ్డుకున్నప్పటికి పెద్ద ఎత్తున ప్రజావాణి కార్యాలయం వరకు వచ్చారు. అనంతరం కలెక్టర్ బయటకు వచ్చి మాట్లాడారు.
ఆదివాసుల రుణమాఫీ కోసం నిరసన
