పార్వతీపురం మన్యం జిల్లా, కురుపాం నియోజకవర్గం, కొమరాడ మండలం, కూనేరు గ్రామంలో మండల పార్టీ అధ్యక్షులు ఉదయ శేఖర్ పాత్రుడు అధ్యక్షతన నిర్వహించిన ప్రజాదర్బార్ కార్యక్రమంలో కురుపాం నియోజకవర్గ శాసనసభ్యురాలు శ్రీమతి తోయక జగదీశ్వరి పాల్గొన్నారు. మండల ప్రజల నుండి వినతులను స్వీకరించి, పరిశీలించారు. ప్రజల నుండి అందిన వినతులకు తక్షణ పరిష్కారం జరిగేలా చర్యలు చేపట్టాలని ఈ సందర్భంగా అధికారులను ఆదేశించారు. మేజర్ సమస్యలపై తాను ప్రభుత్వంతో మాట్లాడి నిధులు మంజూరు చేయిస్తానని ఈ సందర్భంగా తెలిపారు. మండలం పరిధిలోని వివిధ గ్రామాల నుండి వచ్చిన ప్రజలు యొక్క వినతులను స్వీకరించిన అనంతరం ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ సమస్యలు సాధన లక్ష్యంగా కూటమి ప్రభుత్వం, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పనిచేస్తున్నారని కొనియాడారు. ఈ మేరకు ప్రజలు సమస్యలు తెలుసుకునేందుకు ఎమ్మెల్యేలను ప్రజా దర్బార్ పేరుతో ప్రజల వద్దకు పంపిస్తున్నారని తెలిపారు. సమస్యలు పరిష్కారం చేసేందుకు తన వంతు కృషి చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో పొట్నూరు వెంకట నాయుడు, గుల్లిపల్లి సుదర్శన్ రావు, దేవ కోటి వెంకట నాయుడు, నంగిరెడ్డి మధుసూదన్ రావు, తమ్మయ్య, వేణుగోపాల్, గౌరీ శంకర్, అనంత్, సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులు, కూటమి నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
ప్రజాదర్బార్ కార్యక్రమంలో సమస్యలు పరిష్కరించడానికి చర్యలు
