జిల్లా కలెక్టర్, జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) &కమీషనర్ (ఎఫ్ ఎ సి ) ఆదేశాల మేరకు రామగుండం నగర పాలక సంస్థ సిబ్బంది మంగళవారం నగరంలోని వివిధ ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించి నిషేధిత ప్లాస్టిక్ నిల్వలను స్వాధీనం చేసుకొని దుకాణ నిర్వాహకులకు జరిమానా విధించారు. అడ్డగుంటపల్లి లోని లక్ష్మీ కిరాణా దుకాణం నిర్వాహకులకు రూ 20,000 జరిమానా విధించారు. అలాగే ప్లాస్టిక్ ఉపయోగిస్తుండడంతో పాటు పళ్ళ వ్యర్థాలు ప్లాస్టిక్ వ్యర్థాలను దహనం చేస్తున్న పళ్ళ వ్యాపారి ఒకరికి రూ. 15000 మరొకరికి రూ 5000 జరిమానా విధించారు. నగర పాలక సంస్థ సెక్రెటరీ రాజు ఆధ్వర్యంలో హెల్త్ అసిస్టెంట్ కిరణ్ , ఎన్విరాన్మెంటల్ ఇంజినీర్ మధుకర్ తదితరులు ఈ తనిఖీలు నిర్వహించారు.
రామగుండంలో నిషేధిత ప్లాస్టిక్ నియంత్రణకు చర్యలు
