గూడూరు పట్టణం కోనేటి మిట్ట కు చెందిన గుమ్మడి రవికుమార్ గేదలను చిల్లకూరు మండలం గుత్తా వారి పాలెంలో మణి ఇంటి దగ్గర ఉన్నట్లు సమాచారం తెలుసుకున్న రవి, వాళ్ళ అన్న, మామతో కలిసి ఆ గ్రామానికి వెళ్లి గేదెలను తొలివ్వమని అడిగినందుకు కర్రలు రాడ్లతో దాడి చేసి గాయాలు పాలు చేశారు. గాయాలు పాలైన బాధితుడు రవి ని చికిత్స నిమిత్తం గూడూరు ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకొచ్చారు. బాధితుడు రవి వివరాల మేరకు గత మూడు నెలలుగా తప్పిపోయిన గేదలను గూడూరు పట్టణం పరిసర ప్రాంతాల్లో వెతికినా ఎక్కడా కనిపించలేదని తెలిపారు. క డివేడు, గుత్తా వారి పాలెం గ్రామాలలో విచారించగా గుత్తావారిపాలెం మణి అనే వ్యక్తి గేదెలను కట్టేసినట్లుతెలిసింది. కడివేడుగ్రామానికిచెందిన పెద్ద మనిషి శ్రీనివాసులు రెడ్డి మరి కొందరి మనుషులతో కలిసి గేదెలను కట్టేసిన మణి అనే వ్యక్తి ఇంటికి వెళ్లి మాట్లాడడం జరిగిందన్నారు.పెద్దమనుషులు సమక్షంలో గేదెలను తోలిస్తామని ఇంటికి పిలిచి దాడి చేసి దుర్భాషలాడి తీవ్ర గాయాలు పాలు చేశారని తెలిపారు. బాధితుడు గూడూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
బర్రెలను అక్రమంగా కట్టేసినారని అడిగినందుకు వ్యక్తిపై దాడి
