ఇజ్రాయెల్‌పై ఇరాక్ డ్రోన్ల దాడి జరిగింది. ఇరాక్ వైపు నుంచి వచ్చిన రెండు డ్రోన్లు మధ్యధరా సముద్రంలో నేవీ మిస్సైల్ బోటు సాయంతో ఇజ్రాయెల్ మిలిటరీ బలగాలు కూల్చివేశాయి. ఇటీవలి కాలంలో ఇరాన్ నుంచి వచ్చిన అనుమానిత డ్రోన్‌ను కూడా ఇజ్రాయెల్ వైమానిక దళం కూల్చివేసిన విషయం తెలిసిందే.
ఇరాక్ డ్రోన్ల దాడి నేపథ్యంలో ఇజ్రాయెల్ మిలిటరీ అధికులను అప్రమత్తం చేసింది. మధ్యధరా సముద్రంలో డ్రోన్ల కదలికలపై ప్రత్యేక నిఘా పెట్టింది. ఈ దాడులు ఇజ్రాయెల్‌కు సవాలుగా మారాయి. ఇరాక్ లేదా ఇరాన్ నుంచి ఇటువంటి ప్రయత్నాలు మరింత ఉధృతం కావచ్చని అంచనా వేస్తున్నారు.
మరోవైపు లెబనాన్ సరిహద్దు ప్రాంతాల్లో కాల్పుల విరామం అమలులో ఉన్నా ఉల్లంఘనలు జరుగుతున్నాయి. సురక్షిత ప్రాంతాలకు తరలిన ప్రజలు సొంత గ్రామాలకు తిరిగి రావాలనుకుంటున్నా, ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ వారిని అప్రమత్తం చేస్తోంది.
కాల్పుల విరామ ఒప్పందంపై మరింత సమాచారం వచ్చేంత వరకు సరిహద్దు ప్రాంత ప్రజలు తమ గ్రామాలకు వెళ్లరాదని హెచ్చరికలు జారీ అయ్యాయి. లెబనాన్ దక్షిణ ప్రాంత ప్రజలు ఈ నిర్ణయాన్ని గౌరవించాలని ఇజ్రాయెల్ మిలిటరీ సూచించింది.