రాయచోటి లో జాతీయస్థాయి ఉర్దూ నాతియ కవి సమ్మేళనం

Rayachoti to host a grand Urdu Mushaira on Dec 2 at Gafaria Function Hall, featuring renowned poets and special guests from across the country. Rayachoti to host a grand Urdu Mushaira on Dec 2 at Gafaria Function Hall, featuring renowned poets and special guests from across the country.

డిసెంబర్ 2న రాయచోటి పట్టణంలోని గఫారియా ఫంక్షన్ హాల్‌లో జాతీయస్థాయి ఉర్దూ నాతియ కవి సమ్మేళనం నిర్వహిస్తున్నట్లు ముసాయిరా కమిటీ నాయకులు షేక్ మొహమ్మద్ ఖాసిం, అంజద్ భాష తెలిపారు. రాయచోటిలో తొలిసారిగా ఇలాంటి ఉర్దూ ముషాయిరా కార్యక్రమం జరుగుతుండటం గర్వకారణమని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమానికి కడప ఆర్ట్స్ కళాశాల ఉర్దూ విభాగం అసోసియేట్ ప్రొఫెసర్ వసుబుల్లా భక్తీయారి అధ్యక్షత వహించనున్నారు. రాయచోటి భుజమే హుసేని సంస్థ స్థాపకులు రజివుద్దిన్ హుస్సేని ముఖ్య అతిథిగా హాజరవుతారు. ఈ సందర్భంలో పలువురు ప్రముఖ కవులు తమ నాతియ కవిత్వంతో సభను అలరించనున్నారు.

మూడు గంటలపాటు కొనసాగనున్న ఈ ముషాయిరా కార్యక్రమానికి రాష్ట్రం నలుమూలల నుండి ప్రముఖ కవులు హాజరవుతారని కమిటీ సభ్యులు తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా ఉర్దూ భాష, సాహిత్యానికి ప్రోత్సాహం లభించడంతో పాటు స్థానికులకు అరుదైన సాహిత్య అనుభవం కలుగుతుందన్నారు.

పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కమిటీ సభ్యులు పిలుపునిచ్చారు. రాయచోటి ప్రజల సాహిత్యాభిరుచిని గుర్తించే ఈ కార్యక్రమం భవిష్యత్తులో మరింత పెద్ద స్థాయిలో జరగాలని ఆశాభావం వ్యక్తం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *