సమాజంలో అందరూ ఆరోగ్యంగా ఉంటేనే ఆనందంగా ఉండగలుగుతారని డాక్టర్ అన్వర్ అన్నారు. వరంగల్ కేఎంసి నుండి కిల వరంగల్ కోట వరకు హిస్టారికల్ రన్ అండ్ రైట్ కార్యక్రమాన్ని ఉత్సాహంగా నిర్వహించారు.ఈ సందర్భంగా వందలాదిమంది మెడికల్ విద్యార్థులతో పాటు వైద్యులు ఈ ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా డాక్టర్లు అన్వర్, రితేష్, రమేష్ మాట్లాడారు. ఆరోగ్యం పట్ల ప్రతి ఒక్కరూ శ్రద్ధ తీసుకోవాలన్నారు. అంతే కాకుండా ఆరోగ్యంగా ఉండాలంటే ఫిజికల్ హెల్త్ తో పాటు మెంటల్ హెల్త్ కూడా ఉండాలన్నారు చిన్నప్పటినుండే పిల్లల్ని ఆటలాడుకోవడానికి ప్రోత్సహించాలని వారికి శారీరక శ్రమ కలగడం వల్ల ఆరోగ్యంగా ఉండగలుగుతారన్నారు. ఈ ర్యాలీకి కెఎంసి, ఐఎంఏ సహకారం అందజేసిందని అన్నారు. సుమారు ఐదు కిలోమీటర్లు ఈ రన్ అండ్ రైడ్ కార్యక్రమంలో నిర్వహించినట్లు అంతేకాకుండా కుసుమాల్ సమీపంలోని మైదానంలో అందరూ ఉత్సాహంగా నృత్యాలు చేస్తూ ఆనందం వ్యక్తం చేశారు.
ఆరోగ్యం కోసం హిస్టారికల్ రన్ నిర్వహణ
