మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి ఘనవిజయం సాధించడంతో డోన్ బీజేపీ నాయకులు ఆనందంగా సంబరాలు జరిపారు. స్థానిక పాతబస్టాండ్ సమీపంలో బాణాసంచా పేల్చి, మిఠాయిలు పంచి, నరేంద్ర మోడీ జిందాబాద్ నినాదాలు చేశారు.
ఈ సందర్భంగా బీజేపీ కో ఆర్డినేటర్ వడ్డే మహారాజ్ మాట్లాడుతూ, ప్రధాని మోదీ నాయకత్వం దేశాన్ని అభివృద్ధి దిశగా తీసుకెళ్తుందని, విశ్వగురువుగా ఎదగడంలో మరాఠి ప్రజల కృషి కీలకమని చెప్పారు. మహారాష్ట్రలో బీజేపీ బలమైన రాజకీయ శక్తిగా ఎదగడం వారి మద్దతు వల్లేనని పేర్కొన్నారు.
ఇండీ కూటమి ఎన్నో కుట్రలు చేసినా, ఎలాంటి అడ్డంకులు వచ్చినా బీజేపీ విజయం సాధించిందని మహారాజ్ తెలిపారు. ఈ విజయానికి కృషి చేసిన కార్యకర్తలు, ఓటర్లకు ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో బీజేపీ మాజీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్మీ రామయ్య, పట్టణ కో ఆర్డినేటర్ కోడి అశోక్, ఓబీసీ జిల్లా ప్రధాన కార్యదర్శి అవుకు వెంకటేశ్వర్లు, ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షుడు భరణి రమేష్, అరబోలు వీరేష్ తదితరులు పాల్గొన్నారు.