గిట్టుబాటు ధర కల్పించాలని రైతు గగ్గోలు పెడుతున్న కనికరించని ప్రభుత్వం,,, ప్రభుత్వమే ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని సిపిఐ డిమాండ్ కాకినాడ జిల్లా పిఠాపురం,,, అన్నదాత సుఖీభవ, రైతే రాజు, జై కిసాన్ అని ఆర్భాటమైన ప్రచారాలు చేస్తారు గాని రైతు పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించడంలో విఫలం అవుతారని అప్పులు చేసి పెట్టుబడి పెట్టి చేతికొచ్చిన ధాన్యం గిట్టుబాటు ధర రాకపోవడంతో కళ్ళల్లో ధాన్యం పెట్టుకుని రైతు గిట్టుబాటు ధర గురించికళ్ళకాసేలాచూస్తున్నారని మద్దతుదారు ప్రకటించకుండా మెనవేషాలు లెక్కపెడుతున్నారని మండిపడ్డారు ప్రభుత్వం ప్రత్యేక ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి ప్రభుత్వమే కొనుగోలు చేయాలని గురువారం సిపిఐ నాయకులు సాకారామ కృష్ణ మాదాపురం పొలాల్లో రైతులు పోగుచేసిన రాశులను పరిశీలించి రైతు ఆవేదనని మీడియా ద్వారా వ్యక్తపరిచారు,, అన్నం పెట్టే రైతన్నను ఏ ప్రభుత్వంలోను గిట్టుబాటు ధర లభించడం లేదని నారు బోసి నీరు గట్టి కోత కోసి కుప్పునూర్చి చేతికి అందిన పంట దళారులు పాలు అవుతున్నాయని , దళారులంతా సిండికేట్ అయి రైతుకు మద్దతు ధర గండికొడుతున్నారన్నారు,ప్రభుత్వం ధాన్యం కొనుగోలు పై దృష్టి పెట్టి గిట్టుబాటు ధర కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు అదేవిధంగా గత వరదకు ముప్పయిన పంటలకు పంట నష్టం అందలేదని ఆవేదన వ్యక్తం చేశారు ఇప్పటికైనా సంబంధిత అధికారులు పంట నష్టం పరిహారం ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు ఈ కార్యక్రమంలో రైతాంగం పాల్గొన్నారు.
రైతుల గిట్టుబాటు ధరపై ప్రభుత్వానికీ సిపిఐ డిమాండ్
