విజయనగరం జిల్లా మెంటాడ మండలం గుర్ల గ్రామంలో గురువారం మండల స్పెషల్ ఆఫీసర్ ప్రమీల గాంధీ ఆధ్వర్యంలో గ్రామ సందర్శన కార్యక్రమం నిర్వహించారు. గ్రామంలో వ్యక్తి గత మరుగు దొడ్లు వినియోగం పై ఆరా తీసారు. వ్యక్తిగత మరుగుదొడ్లు వినియోగించే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. కాలువలు ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని కోరారు.
పారిశుధ్యం మెరుగుపరచి ప్రజలు వ్యాదులు భారిన పడకుండా చూడాలని అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ బొద్దుల సత్యవతి,ఎంపీడీవో కూర్మానాద్ పట్నాయక్,తహసిల్దార్ కోరాడ శ్రీనివాసరావు, పంచాయతీ అధికారి విమల కుమారి,ఎంఈఓ వర్మ, పంచాయతీ సెక్రెటరీ కె గౌరీ, అంగన్వాడి సూపర్వైజర్ హైమావతి, వీఆర్వో ఎద్దు రాము, తదితరులు పాల్గొన్నారు.