ప్రత్తిపాడు మండలంలో గ్రామోత్సవం వైభవంగా నిర్వహణ

The village festival in Prattipadu Mandal showcased devotional fervor with sankeertanas and rituals. Events highlighted Satya Deeksha and plans for free pujas at Annavaram. The village festival in Prattipadu Mandal showcased devotional fervor with sankeertanas and rituals. Events highlighted Satya Deeksha and plans for free pujas at Annavaram.

కాకినాడ జిల్లా పత్తిపాడు మండలం ప్రత్తిపాడు, ధర్మవరం, ఏలేశ్వరం మండలం పెద్దనాపల్లి, కిర్లంపూడి మండలం జగపతినగరం, సింహాద్రిపురం గ్రామాల్లో గ్రామోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. సత్యదీక్ష ప్రచారకర్త నల్లమిల్లి కృష్ణబాబు మరియు బీజేపీ నాయకులు సింగిలిదేవి సత్తిరాజు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది.

ఈ సందర్భంగా సత్య స్వాములు, మహిళా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. సత్యదేవుని సంకీర్తనలతో గ్రామోత్సవం భక్తిశ్రద్ధల నడుమ సాగింది. సత్యదీక్ష విశిష్టతను ప్రజలందరికీ వివరించిన నల్లమిల్లి కృష్ణబాబును సత్య స్వాములు ఘనంగా సన్మానించారు.

నల్లమిల్లి కృష్ణబాబు మాట్లాడుతూ నవంబర్ 22వ తేదీన అన్నవరం రత్నగిరి కొండపై స్వామి వారి మాలాధారణ చేసిన భక్తులకు ఉచితంగా సత్యనారాయణ వ్రత పూజ నిర్వహిస్తామని, అనంతరం పడిపూజ కార్యక్రమం ఉంటుందని తెలిపారు. నవంబర్ 23న మాల వితరణ కార్యక్రమం నిర్వహించబడుతుందని ప్రకటించారు.

ఈ కార్యక్రమంలో బుద్ధ గంగాపార్వతి, దాడిశెట్టి శేషగిరి, కంద నారాయణరావు, నానపల్లి కృష్ణ, మద్దాల దేవి తదితరులు పాల్గొన్నారు. ఈ గ్రామోత్సవం భక్తి శ్రద్ధలతో జరగడం గ్రామ ప్రజలలో ఆనందాన్ని కలిగించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *