పాలకులు ఎవరైనాప్పటికీ వెనుకబడిన జిల్లాలలో ఒకటైన పార్వతీపురం జిల్లాలో గత 45 సంవత్సరాలుగా జంఝావతి రిజర్వాయర్ ప్రాజెక్టు పూర్తికి రెండు రాష్ట్రాల మధ్య ఓ చిన్నపాటి సమస్యను ఒరిస్యా రాష్ట్రముతో పరిష్కరించుకోలేక అర్ధ శతాబ్ది దగ్గర్లో ఉన్న పాలకులు పరిష్కరించాలనే ఆలోచన లేకపోవడం ఈ ప్రాంత రైతాంగం చేసుకున్న పాపం.
రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి కేంద్రంలో బిజెపి మిత్రపక్ష ప్రభుత్వం ఒడిస్సా రాష్ట్రంలో కూడా ఉండడం ఆ రాష్ట్రముతో చర్చలు జరిపి సమస్య పరిష్కారించడానికి ఇదే మంచి తరుణం. ఈ సమయంలో గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు గారు చొరవ తీసుకొని ఆ రాష్ట్రం తో చర్చలు జరిపి ఎన్నో ఏళ్లగా ఎదురుచూస్తున్న రైతంగానికి రిజర్వాయర్ పూర్తిచేసి సాగునీరు కల్పించాలని విజ్ఞప్తి చేస్తున్నాము.
తోటపల్లి పాత కుడి,ఎడమ ప్రధాన కాలువల ఆధునీకరణకు ఇచ్చిన నిధులలో 25 శాతం లోపు ఖర్చు చేసిన ప్రాజెక్ట్లను ప్రదన్యత క్రమం నుండి తగ్గించిన ప్రాజెక్టులలో ఇది ఒకటి. దీనికి కారణం పాలకులు తప్ప రైతులు కాదు. ఇది విస్మరించిన ప్రభుత్వం తాను చేసిన తప్పిదాలకు ఆయకట్టు రైతులను బలి చేయడం సమంజసం కాదు. కావున తక్షణమే ప్రాజెక్టుల ప్రాధాన్యత క్రమంలో చేర్చి నిదులిచ్చి పనులు చేయాలని కోరుతున్నాము. అదే సందర్భంలో ధరల పెరుగుదలను దృష్టిలో పెట్టుకొని ప్రస్తుత ఎస్ఎస్ఆర్ రేట్ల ప్రకారం నిధులను కేటాయించాలి. ఎడమ ప్రధాన కాలువకు డిజైన్ లో పొందుపర్చిన విధంగా తోటపల్లి నుండి నారాయణపురం ఆనకట్ట మధ్యలో నాగావళి నదిపై ఉన్న ఓపెన్ హెడ్ చానల్స్ ను తోటపల్లి ఎడమ ప్రధాన కాలువకు అనుసంధానిస్తూ ఆయుకట్టు అంతటిని బ్యారేజ్ నిర్మాణ సమయములో పొందుపరిచిన విధంగా ఆయకట్టు అంతటినీ స్థిరీకరించాలి.
గరుగుబిల్లి మండలం చిన్న గుడబ గ్రామ రెవెన్యూ పరిధిలో ఉన్న అత్యం మైనింగ్ కంపెనీ చేస్తున్న నీటి వనరులైన తోటపల్లి ప్రధాన కాలువ, జంఝావతి ప్రధాన కాలువను మైనింగ్ వ్యర్ధాలతో కప్పి వేస్తూ ఎటువంటి అనుమతులు తీసుకోకుండా బ్రిడ్జిలను ఏర్పాటు చేసుకొని యదేచ్చుగా అతి బరువైన వాహనాలను తిప్పుతూ కాలవ గట్లను ధ్వంసం చేస్తున్నారు. అంతేకాకుండా సుమారు 100 ఎకరాలకు సాగు నీరు నిచ్చే నెల్లివాని చెరువును పూర్తిగా కబ్జా చేసేసారు. ఈ విషయంలో సంబంధిత శాఖకు పలుమార్లు చెప్పినప్పటికీ, వ్రాతపూర్వకంగా ఇచ్చినప్పటికీ స్పందించక పోవడం పై ఉన్న అనుమానాలను నివృతం చేయాలి. తక్షణమే విచారణ జరిపి అక్రమ మైనింగ్ సంస్థ లీజు లను రద్దు చేయాలి. మైనింగ్ సమయములో వెలువడుతున్న వ్యర్ధాలు వల్ల చుట్టుప్రక్క గ్రామాలలో వాయు కాలుష్యం తో పాటు మూత్రపిండ వ్యాధులతో బాధపడుతున్నారు. అటువంటి ప్రాణాంతకమైన మైనింగ్ సంస్థ కార్యకలాపాలను నిలుపుదల చేయాలని స్థానిక ప్రజల ప్రాణాలను కాపాడాలని డిమాండ్ చేస్తున్నాం. రావాడ ప్రాజెక్ట్, సీతానగరం,పెద్ద అంకళం కాలువల ఆధునీకరణ పనులకు నిధులు ఇచ్చే పనులు జరిపించాలి. పెద్దగడ్డ,వెంగళరాయ ప్రాజెక్ట్ అదనపు ఆయకట్టు పనులకు కావలసిన నిధులు ఇచ్చి పనులు జరిపించాలి.
ఉత్తరాంధ్రకి గుండెకాయ లాంటి బాబు జగ్జి వన్ రాం ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్టుకు కావలసిన నిధులను ఇచ్చే పనులు చేయించాలి. ధర్నా కార్యక్రమంలో బుడితి శంకర్రావు, కోట జీవన, గరుగుబిల్లి సూరయ్య, ఈదుబిల్లి పాపారావు, పోతయ్య, సత్యం నాయుడు, బి.తవుడు, ఎన్ లక్ష్మీ నాయుడు, తాతబాబు అట్టాన శంకరరావు, పోలురోతూ సంతోష్ కలమట నారాయణరావు, ప్రసాద్ మోహనరావు తదితరులు పాల్గొన్నారు.