ఆర్టీసీ జోనల్ చైర్మన్ సన్నపురెడ్డి సురేష్ రెడ్డి మీడియా సమావేశం

Sannapureddy Suresh Reddy, RTC Chairman, spoke about road issues, RTC worker concerns, and bus services. He also discussed upcoming events and his plans for development in the district. Sannapureddy Suresh Reddy, RTC Chairman, spoke about road issues, RTC worker concerns, and bus services. He also discussed upcoming events and his plans for development in the district.

నగరంలోని రామ్మూర్తి నగర్ లో ఉన్న బిజెపి జిల్లా కేంద్ర కార్యాలయంలో ఆర్టీసీ జోనల్ చైర్మన్ సన్నపురెడ్డి సురేష్ రెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించాడు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొన్ని శాఖలకు మాత్రమే నిధులను విడుదల చేసిందన్నారు. ప్రభుత్వ, ప్రైవేటు రంగ సంస్థలను చాలావరకు జగన్మోహన్ రెడ్డి నిర్వీర్యం చేశాడని ఆరోపించాడు. రాష్ట్రంలో రోడ్లను మరమ్మతులు చేయకుండా విస్మరించడంతో, ఆర్టీసీకి ఎంతో నష్టం వాటిలిందన్నాడు. రోడ్లు సక్రమంగా లేకపోవడంతో వ్యాపారులు, ప్రజలు, ఆర్టీసీ కూడా ఆర్థికంగా నష్టపోయిందన్నాడు. ఆర్టీసీ లో ఉన్న ఉద్యోగులు కార్మికులు పెన్షనర్ల సమస్యలను పరిష్కరించేందుకు ఏనాడూ గత ప్రభుత్వం కృషి చేయలేదన్నాడు. ఆ సమస్యలను పరిష్కరించేందుకు నా శాయ శక్తుల పనిచేస్తానన్నాడు. అలాగే లక్షలాది ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలను ప్రయత్నిస్తానని ఆయన తెలిపాడు. రాష్ట్రం అభివృద్ధి చెందుతున్న ఈనాటికి కూడా ఈ జిల్లాలో పలు ప్రాంతాలకి బస్సు సౌకర్యాలు లేవన్నాడు. అలాంటి గ్రామాలకు కూడా, నా అనుభవంతో, జిల్లా మంత్రులైన పొంగూరు నారాయణ ఆనం రామనారాయణరెడ్డిలతో పాటు, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి లు ఇతర ఎమ్మెల్యేలతో కలిసి, వాళ్లు సలహాలు సూచనలతో ప్రతి గ్రామానికి బస్సు సౌకర్యం ఉండేలా చూస్తామన్నాడు.

గ్రామాలకి కొత్త బస్సుల రూపకల్పనకు, స్వచ్ఛంద సంస్థలు, దాతలు, సీఎస్ఆర్ నిధులతో ఆర్టీసీని అభివృద్ధి పథంలోకి తీసుకెళ్తామన్నాడు. ఈనెల 21న ఈ జిల్లా రీజినల్ కేంద్రమైన నెల్లూరు బస్టాండ్ లో నా మిత్రుడైన రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రమాణస్వీకారం చేయనున్నానని, ఈ కార్యక్రమానికి ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ కొనకల్ల నారాయణ, మాజీ వైద్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్, కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి, ఆనం వెంకటరమణారెడ్డి, వేములపాటి అజయ్, పోలంరెడ్డి దినేష్ రెడ్డి లు పాల్గొంటారని తెలిపాడు. ఆర్టీసీ అభ్యున్నతికి, ఉద్యోగులు, కార్మికులు, సమస్యల పరిష్కారానికి, నాకు పరిచయం ఉన్న కేంద్ర మంత్రులు మాజీ మంత్రులతో సహా ఇక్కడికి తీసుకొని వచ్చి వారి సహాయ సహకారాలతో శక్తి వంచన లేకుండా అభివృద్ధికి తోడ్పాటునందిస్తానన్నాడు. నన్ను వరించిన ఈ పదవి బిజెపిలో కార్యకర్తలకు ఇస్తున్న గౌరవానికి నిదర్శనం అన్నాడు. ఈ సమావేశంలో బిజెపి జిల్లా అధ్యక్షుడు శీపారెడ్డి వంశీధర్‌ రెడ్డి, బిజెపి రాష్ట్ర కార్యదర్శి కంది కట్ల రాజేశ్వరి, మిడతల ,రమేష్, గడ్డం విజయ్ కుమార్, బైరి శ్రీనివాసులు, మొగరాల సురేష్, మండ్ల ఈశ్వరయ్య , యాకసిరి పనిరాజు,చిలక ప్రవీణ్ కుమార్, అశోక్ నాయుడు, కరణం భాస్కర్, సునీల్‌రెడ్డి, శ్రీనివాసులు రెడ్డి, ముని సురేష్ ,పిడుగు లోకేష్ ,కిరణ్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *