సైబర్ నేరాలపై ఎమ్మిగనూరులో అవగాహన ర్యాలీ

An awareness rally in Emmiganur led by District SP G. Bindu Madhav emphasized caution against rising cyber crimes and measures to prevent fraud. An awareness rally in Emmiganur led by District SP G. Bindu Madhav emphasized caution against rising cyber crimes and measures to prevent fraud.

ప్రస్తుత సమాజంలో సైబర్‌ నేరాలు ఎక్కువగా జరుగుతున్నాయని, వాటి పట్ల అప్రమత్తంగా ఉండాలని ఎమ్మిగనూరు లో మంగళవారం అవగాహన ర్యాలీ నిర్వహించారు. జిల్లా ఎస్పీ జి. బిందు మాధవ్ ఐపియస్ ఆధ్వర్యంలో స్థానిక పెద్ద పార్క్ నుండి సోమప్ప సర్కిల్ వరకు ర్యాలీలో నిర్వహించి, జిల్లా ఎస్పీ జి. బిందు మాధవ్ ఐపియస్, డీఎస్పీ ఉపేంద్ర బాబు, టౌన్ సీఐ, రూరల్ సీఐ, , విద్యార్థులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ సైబర్‌ నేరాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. టెక్నాలజీని వాడుకొని నేరగాళ్లు ప్రజల డబ్బులు దోచుకుంటున్నారు. వాట్సాప్‌, ఫేస్‌బుక్‌, ఇతర యాప్‌లు, లింకులు, ఈ మెయిల్స్‌తో హ్యాకర్లు మోసాలకు పాల్పడుతున్నారు. దీంతో పోలీసులు అప్రమత్తమై నేరాల నియంత్రణపై దృష్టిపెట్టారు. ప్రజలు, విద్యార్థులు, యువకులు వారి ఉచ్చులో పడకుండా విస్తృతంగా ఎమ్మిగనూరు లో అవగాహన కల్పించరు. ఏదైనా ఆపదలో ఉంటే 100 నంబర్‌కు డయల్‌ చేయాలని సూచించారు. సైబర్‌ నేరాలపై అవగాహన పెంచుకోవాలన్నారు. మోసాలకు గురైతే 1930 నంబర్‌కు డయల్‌ చేయాలన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *