గిరిజనులకు అండగా వికారాబాద్ జిల్లా కొడంగల్ నియోజకవర్గం దుద్యాల మండలం లగచర్ల రోటిబండ తాండ, పులి చర్ల తాండ, గడ్డమిదితాండ ఈదులకుంటతాండ మైసమ్మగడ్డతాండల గిరిజన బాధితులను మహిళలను రైతులకు వారికీ అండగా వారి సమస్యలు తెలుసుకోవడానికి వారిని పరామర్శించడానికి ఈనెల 20వ తేదీన గిరిజన సంక్షేమ సంఘం ఉమ్మడి మెదక్ జిల్లా, గిరిజన విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో చలో లగచర్ల కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు గిరిజన సంక్షేమ సంఘం ఉమ్మడి మెదక్ జిల్లా అధ్యక్షులు జైపాల్ నాయక్, గిరిజన విద్యార్థి సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పూల్ సింగ్ నాయక్ అన్నారు
ఈ కార్యక్రమానికి ఉమ్మడి మెదక్ జిల్లాలోని అన్ని తండాల్లోని గిరిజనులు,తాలూకా,మండలాల సంఘ కమిటీల వారు, యువకులు, విద్యార్థులు పెద్ద ఎత్తున తరలిరావాలని అన్నారు. ST లంబాడి రైతులపై పెట్టిన అక్రమ కేసులను ఎత్తివేయాలి రాజకీయ లబ్ది కోసం లంబాడి రైతులను బలి చేస్తే ఊరుకునేది లేదని రాజ్యాంగ బద్దంగా పోరాటం కొనసాగిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో రాజు నాయక్, శివాజీ నాయక్, విజయ్ నాయక్, దినేష్, కిరణ్, అకేష్ లు పాల్గొన్నారు