దేవరాపల్లి మండలం తామరబ్బ శివారు కొండకొడాబు కొండ ప్రాంతంలో మేకల మందలోకి గురువారం సాయంత్రం కొండ చిలువ చొరబడింది. ఒక మేకను అమాంతంగా మింగడానికి ప్రయత్నించింది. మేకను మింగబోతున్న కొండచిలువను చూసిన మేకల మంద యజమాని దుంబరి నాగరాజు వెంటనే కేకలు వెయ్యడంతో
చుట్టుపక్కల రైతులు అక్కడికి చేరుకుని కొండ చిలువ నుంచి మేకను రక్షించే ప్రయత్నం చేశారు. జనాన్ని చూసిన కొండచిలువ మేకను వదిలేసి పక్కనే ఉన్న రంద్రంలోకి జారుకుంది. అప్పటికే మేక మృతి చెందడంతో కొండచిలువ గురించి దుంగాడకు చెందిన స్నేక్ కేచర్ వరపల కృష్ణకు సమాచారం అందించారు. వెంటనే అక్కడకు చేరుకున్న ఆయన రంద్రంలో ఉన్న కొండ చిలువను అతి కష్టం మీద బయటకు తీసి అటవీ ప్రాంతంలో విడిచి పెట్టాడు.
దేవరపల్లి వద్ద మేకలను చుట్టుముట్టిన కొండచిలువ
