తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ధాన్యం కొనుగోళ్లలో రైతులకు ఎటువంటి ఇబ్బందులు కలిగితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రైతులను ఇబ్బందులకు గురి చేసే వ్యాపారులపై అధికారులు దృష్టి పెట్టాలని ఆదేశించారు. నిబంధనలను ఉల్లంఘించే వారిపై ఎస్మా చట్టం కింద చర్యలు తీసుకోవాలని కూడా స్పష్టం చేశారు.
పంట కొనుగోళ్లలో మోసాలను నిరోధించేందుకు అధికారులకు స్ఫష్టమైన మార్గదర్శకాలను జారీ చేశారు. రైతుల నుంచి పంట కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం సాఫీగా కొనుగోలు చేసేలా కలెక్టర్లు స్వయంగా పర్యవేక్షణ చేయాలని అన్నారు. ఈ విధంగా రైతులకు లేనిపరిస్థితులలో ఉన్నతాధికారులను సంప్రదించాలని సూచించారు. రైతులకు పంట అమ్మకాల సమయంలో ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని, ప్రభుత్వ పరంగా అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని సీఎం చెప్పారు.
