అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం ఏజెన్సీ ప్రాంతంలోని అడ్డతీగల మండలం తిమ్మాపురం వద్ద ఏలేరు కాల్వలో ఇసుక కోసం వెళ్లి ఈ నలుగురు వ్యక్తులు గల్లంతు అయ్యారు. గల్లంతైన వారు ఏలేశ్వరం మండలం తూర్పు లక్ష్మీ పాలెం కి చెందినవారుగా గుర్తించారు . గల్లంతైన వ్యక్తులు భూషణం, జైబాబు, చిన్న గొంతయ్య, సిహెచ్ శ్రీను. ఈ మేరకు గజ ఈతగాళ్లు సహాయంతో పోలీసులు. గాలింపు చర్యలు చేపట్టారు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరవుతున్నారు. ఇసుకను తీసుకు వెళ్లేందుకు వచ్చి కాలువలో ఈ నలుగురు గల్లంతైయ్యారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
అల్లూరి జిల్లా తిమ్మాపురం వద్ద ఇసుక కోసం గల్లంతైన 4 వ్యక్తులు
