తుర్కియేలో ఉద్యోగం చేస్తున్న అద్నాన్ మహ్మద్, సెలవు రాకపోవడంతో ఆన్‌లైన్ ద్వారా పెళ్లి చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. హిమాచల్ ప్రదేశ్‌లోని మండీలో ఉన్న వధువుతో అతడు వర్చువల్ వివాహం జరిపించుకున్నాడు. వధువు తాతయ్య అనారోగ్యంతో ఉండటం, త్వరగా పెళ్లి కావాలని పట్టుబట్టడంతో ఇరు కుటుంబాలు ఆన్‌లైన్ పెళ్లికి అంగీకరించాయి.
ఈ వర్చువల్ పెళ్లి ఆదివారం బరాత్‌తో ప్రారంభమైంది. సోమవారం పెళ్లి జరిగింది. వీడియో కాలింగ్ ద్వారా ఖాజీ పెళ్లి జరిపించారు. వివాహంలో వధూవరులు ‘ఖుబూల్ హై’ అని మూడు సార్లు చెప్పించి ఆచారం ప్రకారం వివాహం జరిగింది.
పెళ్లికూతురు బంధువు అక్రమ్ మహ్మద్ మాట్లాడుతూ, ఆధునిక సాంకేతికత వల్లే ఈ వివాహం సాధ్యమైందని చెప్పారు. ఇరు కుటుంబాలు ఈ పెళ్లి విధానాన్ని అంగీకరించడంతో ఆనందం వ్యక్తం చేశాయి.