టీమిండియా స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్ ఫామ్ లోకి రాలేకపోతున్నాడు. స్వదేశంలో న్యూజిలాండ్‌తో జరిగిన టెస్టు సిరీస్ తర్వాత, రాహుల్ బెంచ్ పైనే పరిమితమయ్యాడు. ప్రస్తుతం ఆస్ట్రేలియాలో జరుగుతున్న అనధికారిక టెస్టు మ్యాచ్‌లో భారత్-ఏ తరఫున ఆడుతున్నాడు.
మెల్‌బోర్న్ వేదికగా ఆస్ట్రేలియా-ఏతో జరిగిన మ్యాచ్‌లో రాహుల్ రెండు ఇన్నింగ్స్‌లలో కూడా తక్కువ స్కోరుతో పెవిలియన్ చేరాడు. మొదటి ఇన్నింగ్స్‌లో కేవలం 4 పరుగులే చేసిన రాహుల్, రెండో ఇన్నింగ్స్‌లో 44 బంతుల్లో 10 రన్స్‌కే ఔటయ్యాడు. అతను చేసిన బంతి కూడా చాలా చెత్తగా, క్లీన్‌బౌల్డ్ అయ్యాడు.
ఆస్ట్రేలియా-ఏ స్పిన్నర్ రొచిసియోలి వేసిన బంతి రాహుల్ ప్యాడ్స్‌పై తగిలినప్పుడు, రాహుల్ ఆ బంతిని ఆడలేదు. అది ఆఫ్ వికెట్‌కు గిరాటేసి, రాహుల్ క్లీన్‌బౌల్డ్ అయ్యాడు. ఈ సంఘటన ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.