కామానికి కళ్ళు లేవని, మన పూర్వీకుల నుంచి వచ్చిన సూక్తి, అయితే దీనికి ఈ సూక్తికి 100% న్యాయం చేసి స్వయంగా అల్లుడు తల్లి లాంటి అత్తపై వావి వరసలు మరిచి అత్యాచారం చేసిన సంఘటన, రంగారెడ్డి జిల్లా బాలాపూర్ పీఎస్ పరిధిలో గల మహమూద్ కాలనీలో ఆలస్యంగా వెలుగు చూసింది. ఈ సంఘటనపై బాలాపూర్ సిఐ ఎం. సుధాకర్ మాట్లాడుతూ…… మహమ్మద్ షాకిర్ అనే వ్యక్తి ఎలక్ట్రిషన్ గా పనిచేస్తున్నాడని, ఆయనకు మొత్తం ముగ్గురు భార్యలుఅని,మొదటి భార్యకు పిల్లలు లేరని, రెండో భార్యకు ఆరుగురు పిల్లల్లు అని, మూడవ భార్యకు ముగ్గురు పిల్లల్లు అని అయితే మూడో భార్య తండ్రి చనిపోవడంతో తల్లిని తన ఇంట్లోనే పెట్టుకొని కూతురు చూసుకుంటుందని, ఎప్పటినుండో అత్తపై మనసుపడ్డ అల్లుడు షాకీర్ ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి మద్యం తాగించి అత్యాచారం చేశాడని ఆయన వివరించారు. ఈ సంఘటనపై అల్లుడుని అదుపులో తీసుకొని విచారిస్తున్నామని ఆయన తెలిపారు.
రంగారెడ్డి జిల్లాలో అత్తపై అల్లుడి అత్యాచారం
