తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి తనపై చేసిన నిరాధార ఆరోపణలపై కోర్టులో పరువునష్టం దావా వేయగా, తాజాగా ఈ కేసులో మద్రాస్ హైకోర్టు తీర్పు వెలువరించింది. 2017లో కొడనాడు ఎస్టేట్ కేసులో ప్రధాన నిందితుడి సోదరుడు ధనపాల్ చేసిన ఆరోపణలు తన ప్రతిష్ఠను దెబ్బతీశాయని పళనిస్వామి పేర్కొన్నారు. ధనపాల్ తనపై నిందలు వేశారని ఆరోపిస్తూ కోర్టును ఆశ్రయించారు.
కేసు విచారణలో జస్టిస్ ఆర్ఎంటీ టీకా రామన్ తీర్పు ఇస్తూ, ధనపాల్ పళనిస్వామిని కించపరిచే భాషను ఉపయోగించారని, ఇందువల్ల ఆయన ప్రతిష్ఠ దిగజారిందని పేర్కొన్నారు. ధనపాల్ చేసిన ఆరోపణలు నిరాధారమని, అవి పళనిస్వామిని కించపరిచే ఉద్దేశంతోనే చేసినట్లు పేర్కొన్నారు. ఈ ఆరోపణల కారణంగా పళనిస్వామి పరువుకు నష్టం వాటిల్లిందని తేల్చిన న్యాయస్థానం, ధనపాల్ రూ. 1.1 కోట్ల పరిహారం చెల్లించాలంటూ ఆదేశించింది.