బాలీవుడ్ నటుడు షారూక్ ఖాన్‌కు ఇటీవల రూ.50 లక్షలు ఇవ్వకపోతే చంపేస్తామని బెదిరింపు కాల్ వచ్చింది. ఈ బెదిరింపు ఫోన్ కాల్ రావడంతో షారూక్ ఖాన్ బాంద్రా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు ఈ వ్యవహారంపై దర్యాప్తు చేపట్టారు.
విచారణలో భాగంగా షారూక్‌కు వచ్చిన ఫోన్ కాల్స్‌ను ట్రేస్ చేశారు. ఛత్తీస్‌గఢ్ రాయ్‌పూర్ నుంచి ఈ బెదిరింపులు వచ్చినట్లు పోలీసులు గుర్తించారు. రాయ్‌పూర్‌కు చెందిన ఫైజాన్ ఖాన్ అనే వ్యక్తి ఈ బెదిరింపులకు పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. అతని కోసం పోలీసులు గాలిస్తున్నారు.
పోలీసులు ఫైజాన్ ఖాన్‌ను సంప్రదించగా, తనను హిందుస్థానీ అని పిలవాలని కోరాడని మీడియా నివేదికలు చెబుతున్నాయి. నవంబర్ 5న షారూక్‌కు ఈ బెదిరింపు కాల్ వచ్చినట్లు తెలుస్తోంది. గతంలో సల్మాన్ ఖాన్‌కి కూడా ఇదే తరహా బెదిరింపులు వచ్చిన విషయం తెలిసిందే.