నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా, ఏపీ, తెలంగాణలో నాలుగు రోజులపాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ (ఐఎండీ) వెల్లడించింది. ఈ వర్షాలు ఉష్ణోగ్రతలను కనిష్ఠ స్థాయికి పడిపోవడానికి దారితీయవచ్చు అని కూడా వాతావరణ శాఖ చెప్పింది.
తమిళనాడుకు తుపాను ముప్పు పొంచి ఉందని ఐఎండీ హెచ్చరించింది. రానున్న 48 గంటల్లో బంగాళాఖాతం మరింత అల్లకల్లోలంగా మారిపోతుందని, మత్స్యకారులు చేపలవేటకు వెళ్లవద్దని హెచ్చరికలు జారీచేసింది. చెన్నై, తిరువళ్లూరు, కాంచీపురానికి ఆరెంజ్ అలెర్ట్ జారీచేసింది.
తమిళనాడులోని 19 జిల్లాల్లో రెండు రోజులపాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. లోతట్టు ప్రాంతాల్లో నివసించే ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలించాలని హెచ్చరించింది.