బలిజ మెరిట్ విద్యార్థులకు పురస్కారాలు అందజేసిన మంత్రి నారాయణ

In a ceremony at the Balija (Kapu) Bhavan in Nellore, Minister Narayana awarded scholarships to merit students, emphasizing TDP's support for education.
  • నెల్లూరులోని బ‌లిజ(కాపు) భ‌వ‌న్‌లో విద్యార్థుల‌కు పుర‌స్కారాలు అందిజేసిన మంత్రి నారాయ‌ణ‌
  • ప్రతిభవంతులైన బలిజ విద్యార్థులకు ప్రతిభ పురస్కారాలు అందజేయడం సంతోష‌క‌రం
  • 104 మంది విద్యార్థుల‌కు డాక్ట‌ర్ పోక‌ల ర‌వి స‌హ‌కారంతో రూ.4.80 ల‌క్ష‌లు అంద‌జేత‌
  • త్వ‌ర‌లో బ‌లిజ (కాపు) భ‌వ‌నాన్ని స‌ర్వాంగ సుంద‌రంగా తీర్చిదిద్దుతాం
  • కార్య‌క్ర‌మానికి విచ్చేసిన మంత్రికి ఘ‌న‌స్వాగ‌తం ప‌లికిన బ‌లిజ (కాపు) సంఘం నేత‌లు

పేద విద్యార్థుల ఉజ్వ‌ల భ‌విష్య‌త్‌కు టీడీపీ ప్ర‌భుత్వం పెద్ద‌పీఠ వేస్తుంద‌ని రాష్ట్ర పుర‌పాల‌క ప‌ట్ట‌ణాభివృద్ధి శాఖ మంత్రి డాక్ట‌ర్ పొంగూరు నారాయ‌ణ తెలియ‌జేశారు. నెల్లూరులోని బ‌లిజ (కాపు) భ‌వ‌న్‌లో డాక్ట‌ర్ పోక‌ల ర‌వి స‌హ‌కారంతో బ‌లిజ మెరిట్ విద్యార్థుల‌కు పుర‌స్కారాలు అంద‌జేసే కార్య‌క్ర‌మంలో మంత్రి ముఖ్యఅతిథిగా విచ్చేశారు. ముందుగా జ్యోతి ప్రజ్వ‌ళ‌న చేసి సభను మంత్రి ప్రారంభించారు. అనంతరం మంత్రి నారాయణను బ‌లిజ సంఘం నేత‌లు గజమాల, శలవాలతో ఘ‌నంగా స‌త్క‌రించారు. అక్క‌డికి విచ్చేసిన విద్యార్థుల‌తో మంత్రి నారాయ‌ణ ఎంతో ఆప్యాయంగా మాట్లాడారు. అనంత‌రం 104 మంది బ‌లిజ విద్యార్థుల‌కు న‌గ‌దు పుర‌స్కారాల‌ను అంద‌జేశారు.
ఈ సంద‌ర్భంగా రాష్ట్ర పుర‌పాల‌క ప‌ట్ట‌ణాభివృద్ధి శాఖ‌మంత్రి డాక్ట‌ర్ పొంగూరు నారాయ‌ణ మాట్లాడుతూ డాక్ట‌ర్ పోక‌ల ర‌వి స‌హ‌కారంతో 104 మంది బ‌లిజ మెరిట్ విద్యార్థుల‌ను ప్రోత్స‌హించాల‌నే ఉద్యేశంతో రూ.4.80 ల‌క్ష‌ల నిధులు అంద‌జేయ‌డం అభినంద‌నీయ‌మ‌ని కొనియాడారు. టీడీపీ హయాంలో కాపు భావానికి అన్ని హంగులు తెచ్చామ‌న్నారు. అయితే ఈ భవనాన్ని వైసీపీ ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని మండిప‌డ్డారు. అయితే టీడీపీ ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చాక తొలి సారిగా ఈ రోజు కాపు బ‌లిజ భవనంలోకి అడుగుపెట్టడం సంతోషంగా ఉంద‌న్నారు. ఈ భ‌వ‌నంలో తొలిసారిగా పేద విద్యార్థుల‌కు పుర‌స్కారాలు అందించే కార్య‌క్ర‌మాన్ని ఏర్పాటు చేసిన డాక్ట‌ర్ పోక‌ల ర‌వి, వారి మిత్రబృందాన్ని అభినందిస్తున్న‌ట్లు తెలిపారు. త్వ‌ర‌లో కాపు బ‌లిజ భ‌వ‌న్‌లో మిగిలిన ప‌నుల‌న్నీ పూర్తి చేసి స‌ర్వాంగ సుంద‌రంగా తీర్చిదిద్దుతామ‌ని మంత్రి నారాయ‌ణ మాటిచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *