కెసిఆర్ 10 సంవత్సరాల పాలనలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగలేదని, రైతుబంధు, రైతు భీమా వంటి పథకాలను ప్రవేశపెట్టి రైతులను ఆదుకున్న ఘనత కేసిఆర్ ది అని మెదక్ మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు పద్మ దేవేందర్ రెడ్డి అన్నారు. ఆమె మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తరువాత రైతులకు అనేక ఇబ్బందులు ఏర్పడినట్లు పేర్కొన్నారు. బోనస్ ఆశ చూపి రైతుల కళ్ళలో కన్నీరు పెట్టించిన దుస్థితి నెలకొన్నట్లు చెప్పారు.
మెదక్ జిల్లా నార్సింగ్ మండలంలోని జప్తి శివునూర్, నార్సింగ్ గ్రామాల్లో మెదక్ మాజీ ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి కొనుగోలు కేంద్రాలను పరిశీలించారు. ఆమె తడిసి మొలకెత్తిన ధాన్యాన్ని కూడా పరిశీలించి, జిల్లా అధికారులను ఫోన్ ద్వారా సూచిస్తూ, ఎలాంటి ఆంక్షలు లేకుండా ప్రతి చివరి గింజ కూడా కొనుగోలు చేయాలని కోరారు.
ఆమె మాట్లాడుతూ, “ఎద్దు ఏడ్చిన వ్యవసాయం, రైతు ఏడ్చిన రాజ్యం బాగుపడదని” వ్యాఖ్యానించారు. కేసిఆర్ పాలనలో రైతులు ఎంతో సంతోషంగా ఉండేవారని, కాని ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల కళ్ళల్లో కన్నీరు చూపిస్తున్నట్లు అన్నారు. ఎన్నికల సమయంలో మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికైనా వెంటనే స్పందించి రైతులకు రైతు భరోసా, రైతు బంధు పథకాలను అందించాలని ఆమె డిమాండ్ చేశారు.
Participants:
ఈ కార్యక్రమంలో నార్సింగి మండల మాజీ MPP ఉపాధ్యక్షురాలు సుజాత, BRS నార్సింగి మండల అధ్యక్షుడు మైలారం బాబు, చిన్న శంకరంపేట BRS మండల అధ్యక్షులు రాజు, లక్ష్మా రెడ్డి, గోండా స్వామి, యాదగిరి, చందర్, నార్సింగి చిన్న శంకరంపేట మండలాల BRS నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.