ఆపిల్ ఇటీవల iOS 18.1 ను యూజర్‌లకు విడుదల చేసింది. ఈ అప్డేట్‌తో పాటు కొత్త ఫీచర్లు అందుబాటులోకి వచ్చాయి, అయితే కాల్ రికార్డింగ్ ఫీచర్ (iPhone Call Recording Feature) ప్రత్యేకంగా యూజర్‌లందరిలో ఆసక్తి కలిగిస్తోంది. ఎటువంటి థర్డ్ పార్టీ యాప్‌లు అవసరం లేకుండా, ఇప్పుడు కాలింగ్ సమయంలో ఈ రికార్డింగ్ చేసుకోవచ్చు. ఈ ఫీచర్‌ను ఎలా యాక్టివేట్ చేసుకోవాలో, ఎలా ఉపయోగించాలో పూర్తిగా తెలుసుకుందాం.
ఇప్పుడు, ఐఫోన్ యూజర్‌లు ఈ కాల్ రికార్డింగ్ ఫీచర్‌ను పొందేందుకు తొలుత iOS 18.1 వెర్షన్‌కు అప్‌డేట్ కావాల్సి ఉంటుంది. అప్‌డేట్ వివరాలు నోటిఫికేషన్ రూపంలో అందుతాయి లేదా మాన్యువల్‌గా సెట్టింగ్స్ > సాఫ్ట్‌వేర్ అప్‌డేట్‌లోకి వెళ్లి అప్‌డేట్ చేసుకోవచ్చు. iPhone SE 2, XS, XR, 11, 12, 13, 14, 15, 16 వంటి మోడళ్లు ఈ ఫీచర్‌ను సపోర్టు చేస్తాయి. ఆపిల్ ఇంటెలిజెన్స్‌ను ఉపయోగించుకునే డివైస్‌లలో కాల్ రికార్డింగ్ ట్రాన్సిక్రిప్షన్‌ను కూడా అందించవచ్చు.
ఈ ఫీచర్‌ను ఉపయోగించడం చాలా సులభం. కాలింగ్ సమయంలో టాప్ లెఫ్ట్‌లో రికార్డు బటన్ కనిపిస్తుంది. ఆ బటన్‌ను క్లిక్ చేయడం ద్వారా ఇన్‌కమింగ్ లేదా అవుట్‌గోయింగ్ కాల్స్‌ను రికార్డు చేయవచ్చు. అయితే, కాల్ రికార్డు చేస్తున్న విషయాన్ని అవతలి వ్యక్తికి ఆడియో రూపంలో తెలిసిపోతుంది. కాల్ పూర్తయిన తర్వాత, రికార్డింగ్ నోట్స్ యాప్‌లో సేవ్ అవుతుంది, తద్వారా ముఖ్యమైన అంశాలను తెలుసుకోవడానికి సులభం అవుతుంది. ఐఫోన్ యూజర్‌లు ఈ ఫీచర్‌ను ఆఫ్ చేసుకునేందుకు కూడా అవకాశం ఉంటుంది.