రామచంద్రపురం పట్టణ ఎల్ఐసి కార్యాలయం వద్ద ఎల్ఐసి ఏజెంట్లు మహా ధర్నా నిర్వహించారు. ఆల్ ఇండియా ఎల్ఐసి ఏజెంట్ల సంఘం పిలుపుమేరకు నిర్వహించిన ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా జిల్లా అధ్యక్షులు మాధవరావు పాల్గొని మాట్లాడుతూ ఎల్ఐసి మేనేజ్మెంట్ దిగి వచ్చేవరకు ఈ పోరాటం ఆగదని ఎల్ఐసి ఏజెంట్లు న్యాయమైన డిమాండ్లు పరిష్కరించని యెడల వచ్చే ఏడాది జనవరిలో ముంబైలో మహా ధర్నా నిర్వహిస్తామని వారు హెచ్చరించారు.మినిమం ప్రీమియం లక్ష నుండి రెండు లక్షల వరకు పెంచడం ఏజెంట్ల కమిషన్ తగ్గించేందుకేనని విమర్శించారు. మినిమం పాలసీ లక్ష నుండి రెండు లక్షల వరకు పెంచడం సామాన్యులకు ఎల్ఐసి పాలసీ అందుబాటులో లేకుండా చేయడమేనని అన్నారు. లియాపి అధ్యక్షుడు మస్తాన్ మాట్లాడుతూ సోమవారం రోజు ఉదయం నుండి సాయంకాలం వరకు స్థానిక ఎల్ఐసి కార్యాలయం వద్ద ఏజెంట్ లో సమ్మె సాయంత్రం వరకు కొనసాగిందని అన్నారు. పాలసీదారుల ప్రవేశ వయసు 55 సంవత్సరాల నుండి 50 సంవత్సరాలు తగ్గించడం పాలసీదారులను ఎల్ఐసి నుండి దూరం చేయడమేనని విమర్శించారు. తక్షణమే డిమాండ్లు పరిష్కరించి ఏజెంట్లకు న్యాయం చేయాలని అన్నారు .ఈ కార్యక్రమంలో సుమారు 200 మంది ఎల్ఐసి ఏజెంట్లు పాల్గొని కార్యాలయం ముందు ధర్నా నిర్వహించి నినాదాలు చేశారు.
రామచంద్రపురంలో ఎల్ఐసి ఏజెంట్ల ధర్నా
