అదిలాబాద్ జిల్లాలో పర్యటించిన బీసీ కమిషన్ సభ్యులకు పలు ప్రజా సంఘాలు, బీసీ సంఘాలు, కుల సంఘాలు, ఉద్యోగ సంఘాలకు, సంబంధించిన ప్రతినిధులు బిసి కుల గణనపై వినతి పత్రాలు సమర్పించారు. ఈ సందర్భంగా బీసీ కమిషన్ సభ్యులు తిరుమలగిరి సురేందర్, ప్రకాష్, బాలలక్ష్మీ, లను శాలువాలతో సన్మానించారు.జడ్పీ సమావేశ మందిరంలో అన్ని కులలతో బహిరంగ విచారణ జరిపారు.అనంతరం బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్ మాట్లాడుతూ స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ కల్పనకు జిల్లాల వారీగా ప్రజల నుంచి విజ్ఞప్తులను స్వీకరించడానికి బీసీ కమిషన్ ఆదిలాబాద్ కు పర్యటనకు వచ్చిందని, ఆదిలాబాద్ జిల్లా నుంచే బిసి గణనపై జిల్లాల వారీగా పర్యటనకు శ్రీకారం చుట్టామని ఈరోజు నాలుగు జిల్లాలకు సంబంధించిన బీసీ సంఘాలు ప్రజాసంఘాల నుంచి విజ్ఞప్తులు స్వీకరిస్తామని వెల్లడించారు.
అదిలాబాద్‌లో బీసీ కమిషన్ సభ్యుల పర్యటన
