మెదక్ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పరచడమే ధ్యేయంగా పనిచేయడం జరుగుతుందని, ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు అన్నింటిని కూడా ఒక్కొక్కటిగా నెరవేర్చడం జరుగుతుందని, రైతులకు అండగా ఉంటామని, రైతులు పండించిన ప్రతి చివరి గింజ వరకు ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనoపల్లి రోహిత్ అన్నారు. రామాయంపేట మండలంలోని రామయంపేట, లక్ష్మాపూర్, కాట్రియాల,తొని గండ్ల, గ్రామాలలో రామాయంపేట సొసైటీ చైర్మన్ బాదే చంద్రం ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆయన ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం పేదల ప్రభుత్వమని పేదల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిన ఘనత కాంగ్రెస్ దేనని మెదక్ నియోజకవర్గం న్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పరచడం జరుగుతుందని ఆయన అన్నారు. ఎన్నికల సమయంలో రైతులకు ఇచ్చిన హామీలను నెరవేర్చడం జరుగుతుందని సన్న రకం ధాన్యానికి క్వింటాలకు 500 రూపాయలు బోనస్ ఇవ్వడం జరుగుతుందని, రైతులు దళారులను నమ్మి మోసపోవద్దనే ఉద్దేశంతో ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయడం జరుగుతుందని ఆయన తెలిపారు. రైతులు పండించిన ధాన్యాన్ని ప్రతి చివరి గింజ వరకు ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో సొసైటీ చైర్మన్ భాదే చంద్రం, తహసిల్దార్ రజనీకుమారి, సీఈఓ నరసింహులు, మాజీ ఎంపీపీ రమేష్ రెడ్డి, సుప్రభాత్ రావ్, బైరం కుమార్, డాకిస్వామి, విప్లవ కుమార్, శ్రీధర్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
రైతుల హామీలను నెరవేర్చుతున్న ఎమ్మెల్యే రోహిత్
