సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలోని పాలిటెక్నిక్ కళాశాలను సందర్శించిన అనంతరం గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి తో కలిసి ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో తెలంగాణ రాష్ట్ర ఎస్సి కార్పొరేషన్ చైర్మన్ నగరి ప్రీతం మాట్లాడుతూ విద్యార్థుల భవిష్యత్ విషయం లో కాంగ్రెస్ పార్టీ ఎక్కడ కూడా వెనకడుగు వేయదని, గత 10 సంవత్సరాలలో గజ్వేల్ పట్టణంలోని పాలిటెక్నిక్ కళాశాల లో బి ఆర్ ఎస్ ప్రభుత్వం పరిష్కరించని, సమస్యలను మేము నెల రోజుల్లో పరిష్కరించి చూపిస్తామని హామీనిచ్చారు. కేసీఅర్ గజ్వేల్ శాసన సభ సభ్యునిగా ఉండి కళాశాలలో స్ట్రీట్ లైట్ వేయలేని పరిస్తితికి వచ్చదని ఎద్దేవా చేసాడు. అభివృద్ది అంటే ఫార్మ్ హౌస్ లో పంచ కట్టుకొని తిరుగుడు కాదు కేసీఅర్, నీ నియోజకవర్గం లో ఏం జరుగుతుందో చుసుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.
గజ్వేల్ పాలిటెక్నిక్ సమస్యలు పరిష్కరిస్తామని ప్రీతం హామీ
