అరకు వేలి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏపీ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీమతి పాచి పెంట శాంతకుమారి ఆధ్వర్యంలో నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తో విస్తృతస్థాయి సమావేశం నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా శ్రీమతి పాచి పెంట శాంతకుమారి మాట్లాడుతూ కూటమి రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలు సూపర్ సిక్స్ పథకాలు అమ్మ ఒడి, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, నిరుద్యోగ భృతి అమలు చేయడంలో విఫలమయ్యారు. గిరిజనులకు ఇచ్చిన హామీ GO నెంబర్ 3 చట్టబద్ధత కల్పించాలని డిమాండ్ చేశారు. 1/70 చట్టం పీసా చట్టం ఐటీడీఏ పరిధిలో బ్యాక్లాగ్ నోటిఫికేషన్ జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని, ఐటీడీఏ పాలకవర్గ సమావేశాలు ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం చొరవ చూపాలని, ఈ సమావేశం ద్వారా తీర్మానించడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ నాయకులు రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నించాలి. గిరిజనుల హక్కులు చట్టాల కోసం కాంగ్రెస్ పార్టీ ముందు ఉండి పోరాటం చేయాలని నాయకులు కార్యకర్తలకు దిశా దశ నిర్దేశం చేశారు. కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో రాష్ట్రంలో అధికారం లేకపోవడం వలన గిరిజనులు చాలా అన్యాయానికి గురి అవుతున్నారు. బిజెపి పార్టీ కూటమి రాష్ట్ర ప్రభుత్వము తెలుగుదేశం, జనసేన, బిజెపి పార్టీలు చేస్తున్న అరాచకాలు, మోసాలు, ప్రభుత్వ వైఫల్యాలు ప్రజల్లోకి తీసుకెళ్లాలని కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు, కాంగ్రెస్ పార్టీ బలోపేతం కొరకు గిరిజనుల హక్కులు, చట్టాలు, న్యాయం, ధర్మం అన్ని ఒక్క కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యపడుతుందని ప్రజల ముందు కాంగ్రెస్ పార్టీ విధి విధానాలు తెలియజేయాలని ఈ సందర్భంగా నాయకులకు సూచించారు. రెండవసారి ఏపీ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా శ్రీమతి పాచి పంట శాంతకుమారి ఎన్నికైన సందర్భంగా నాయకులు, కార్యకర్తలు శుభాకాంక్షలు అభినందనలు తెలియజేస్తూ ఘనంగా పూల బొకేతో సాలువ కప్పి సన్మానించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో నాయకులు తెలగంజి సోమేశ్వరరావు కిల్లో జగన్నాథం , పాంగి గంగాధర్, కోర్ర కోమటి వేంగడ నీలకంఠం, కుర్తాడి మత్యరాజు, కోర్ర కొండబాబు, గొల్లూరి పద్మ, కొర్రమితుల చిట్టం నాయక్, బాల బదర్ కోర్రపోతురాజు, మజ్జి అద్దు, వి రమేష్, జి భాగ్యరాజు, ఎన్ ఎస్ యు ఐ జిల్లా అధ్యక్షుడు వేంగడా, జగన్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.