మలికిపురం ఎల్ ఎస్ ల్యాండ్ మార్క్ లో కూటమి నేతలు, కార్యకర్తల సమావేశ. కూటమి బలపరిచిన ఉభయగోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థికి సంబంధించి ఓట్ల నమోదు తదితర అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా రాజశేఖర్ మాట్లాడుతూ… ఇది జనరల్ ఎలక్షన్ ల కాదన్నారు. పట్టభద్రులు అందరు తప్పనిసరిగా మరలా ఓటు నమోదు చేసుకోవాలన్నారు. పట్టభద్రులు ఎక్కడ ఉన్నా వారిచే ఓటు నమోదు చేయించే బాధ్యత మన కార్యకర్తలు అంతా తీసుకోవాలన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రపంచ ఖ్యాతి గాంచిన గొప్ప విజన్ ఉన్న నేత అని, ఆయనను ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలన్నారు.
అమలాపురం ఎంపీ – గంటి హరీష్ మాధుర్, రాజోలు ఎమ్మెల్యే – దేవ వరప్రసాద్ లు మాట్లాడుతూ, కూటమి బలపరిచిన అభ్యర్థిని భారీ మెజారిటీతో గెలిపించే బాధ్యత మనందరిపై ఉందన్నారు. ప్రతి కార్యకర్త ఒక సైనికుని వలె పనిచేసి రాజశేఖర్ ని అఖండ మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కూటమి ముఖ్య శ్రేణులు, కార్యకర్తలు పాల్గొన్నారు.