ఖమ్మం జిల్లా సత్తుపల్లి పట్టణంలో ఆదివాసి గిరిజన ఐక్యత సంఘాల ఆధ్వర్యంలో 84వ కొమరం భీమ్ జయంతి కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. పట్టణంలో ఉన్న కొమరం భీం విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆదివాసి గిరిజనులకోసం కొమరం భీమ్ పోరాడిన సంఘటనలుగుర్తు చేసుకున్నారు.జంగిల్ జమీన్ అంటూ బ్రిటిష్ వారిపై పోరాడిన రోజులను గుర్తు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆదివాసి గిరిజన జేఏసీ నాయకులు కూడా పాల్గొన్నారు.
కొమరం భీమ్ జయంతి ఘనంగా నిర్వహణ
