భారీ కేట్లను తోసుకొని కామారెడ్డి జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలోని వెళ్లే ప్రయత్నం చేశారు వెంటనే పోలీస్ సిబ్బంది అడ్డుకొని కలెక్టరేట్ కార్యంలోనికి వెళ్లకుండా అడ్డుకున్నారు. బీబీపేట్ మండల కేంద్రంలోని మహాత్మా జ్యోతిభాపులే బాలుర వసతి గృహంలో వసతులు కల్పించాలని డిమాండ్ చేస్తూ జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు విద్యార్థులతో తల్లిదండ్రుల ధర్నా నిర్వహించారు. విద్యార్థుల యొక్క వసతి భవనాన్ని వెంటనే వేరే ప్రాంతానికి మార్చాలని విద్యార్థుల తల్లిదండ్రులు డిమాండ్ చేస్తూ వసతులు కల్పించకపోవడం సిగ్గు సిగ్గు అంటూ నినాదాలు చేసిన విద్యార్థులు. ఈ సందర్భంగా విద్యార్థుల తల్లిదండ్రులు మాట్లాడుతూ: బీబీపేట మండల కేంద్రంలో గల మహాత్మ జ్యోతిబాపూలే హాస్టల్ బిల్డింగ్ మార్చాలని పలుసాలు జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లడం జరిగిందని తెలిపారు. ఎన్నిసార్లు కలెక్టర్ కార్యాలయంకు వచ్చిన మా విద్యార్థుల యొక్క సమస్యలు పరిష్కరించడం లేదని డిమాండ్ చేశారు. వెంటనే మహాత్మ జ్యోతిబాపూలే హాస్టల్ బిల్డింగ్ మార్చాలని లేకపోతే హాస్టల్ విద్యార్థులతో హైదరాబాద్ సెక్రెటరీ కూడా ముట్టడిస్తామని డిమాండ్ చేశారు.
వసతి సౌకర్యాల కోసం విద్యార్థుల ధర్నా, కలెక్టరేట్ వద్ద పోరాటం
