ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇలాకాలో దళిత సర్పంచ్ కి అవమానం పిఠాపురం నియోజకవర్గం నవఖండ్రవాడ గ్రామంలో నిన్న జరిగిన పల్లె పండగ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ అయినా బళ్ల రజిని వాణి సురేష్ దళిత మహిళ అవటంవల్ల జనసేన పార్టీ పిఠాపురం నియోజకవర్గ ఇన్చార్జ్ మర్రెడ్డి శ్రీనివాస్ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసే సమయంలో కనీసం దండేయడానికి కూడా పిలవలేదని పిలవకపోయినా కిందకు వచ్చి కొబ్బరికాయ కొట్టించుకున్నారు కదా అక్కడ వరకునే మీ పని ఇక మీ పని ఏమీ లేదు అంటూ పరుషంగా మాట్లాడుతూ అక్కడనుండి ముందుకు తగులారని నవాఖండ్రవాడ సర్పంచ్ వాపోయారు. అక్కడున్న గ్రామ ప్రజలు అవాక్కవటం ఒక వంతు అయితే అక్కడ ఉన్న జనసేన నాయకులు మీ దిక్కున చోట కెళ్ళి చెప్పుకోండి మీరు ఏమి చేయలేరు అంటూ దుర్భాషలాడుతూ సాగారని బాధతో వివరించారు.
ఈ విషయమే బల్ల సురేష్ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రావటంతో మా గ్రామం చాలా అభివృద్ధి జరుగుతాయని ఎంతో ఆశపడ్డ మాకు కన్నీళ్లే మిగిల్చారని గతం వైసిపి ప్రభుత్వం లో దళిత సర్పంచులకు కనీస మర్యాద కూడా ఇవ్వకుండా ఎంతగానో ఇబ్బంది పెట్టారని అభివృద్ధి పనులు చేయకుండా ఆటంకపరిచారని ఆ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేసి కూటమి ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ మోడీ వల్ల రాష్ట్రము అలాగే మా గ్రామము అభివృద్ధి చెందుతుందని ఆశపడ్డాము కానీ ఇక్కడ కూడా కుల వివక్షత స్పష్టంగా కనిపిస్తుందని. సర్పంచులకు ఇవ్వాల్సిన గౌరవం ఇవ్వకుండా స్థానిక జనసేన కార్యకర్తలు చెప్పుకుంటూ మర్రెడ్డి శ్రీనివాస్, మేము ఏం చెప్తే అదే వింటారని ప్రజలందరికీ చెబుతూ సర్పంచ్ ఒక డమ్మీ సర్పంచ్ అని సర్పంచ్ కి ఏమి విలువ ఇవ్వాల్సిన అవసరం లేదని మాజీ సర్పంచ్ పిల్లి కృష్ణ ప్రజలందరికీ తప్పుగా పెట్టిస్తున్నారని అన్నారు. నవ ఖం గ్రామ అభివృద్ధికి కృషి చేయాలని మర్రెడ్డి శ్రీనివాస్ ప్రవర్తన అసలు బాగోలేదని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కి తెలియజేస్తున్నామని దీనిపై స్పందించకపోతే ఆమరణ నిరాహార దీక్షకి కూర్చుంటామని ఈ సమస్యలు పరిష్కరిస్తూ గ్రామ అభివృద్ధికి కృషి చేయాలని అన్నారు ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు కొప్పిశెట్టి అప్పారావు సిద్ధాంతపు బాలకృష్ణ పీతల వీరాగవులు కొర్ర అర్జున్ రావు తదితరులు పాల్గొన్నారు.
ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇలాకాలో దళిత సర్పంచ్ అవమానం
