ఖమ్మం జిల్లా ఖమ్మం రూరల్ మండలం గుర్రాలపాడులో సీసీఐ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పత్తి కొనుగోలు కేంద్రాన్ని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో తుమ్మల మాట్లాడుతూ అధిక వర్షాల వల్ల పంట దిగుబడి తగ్గి రైతులు కష్టాల్లో ఉన్నారని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 44 లక్షల ఎకరాల్లో పత్తి సాగు చేశారని,సీసీఐ కేంద్రాలను జిల్లా అధికారులు ఎప్పటికప్పుడు పరిశీలించి రైతులకు నష్టం జరగకుండా చూడాలని అన్నారు.ప్రయివేటు వ్యాపారులు కూడా మద్దతు ధరకే రైతుల నుంచి పత్తి కొనుగోలు చేయాలని,మిర్చి,పత్తి కి వాతావరణ పరిస్థితులు అనుకూలించడం లేదని,రైతులు ఆయిల్ పామ్ సాగు చేస్తే మార్కెటింగ్ సమస్యలు ఉండవని అన్నారు.రాష్ట్రం మొత్తం పెద్ద ఎత్తున ఆయిల్ పామ్ పై దృష్టి సారిస్తున్నారని,ఎక్కువ ఆదాయం వచ్చే పంటల వైపు రైతులు దృష్టి పెట్టాలని ఆయన సలహా ఇచ్చారు.రైతులు పండించిన పంటలను నష్టం వచ్చినా ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని,పత్తి కొనుగోలు కేంద్రాల వద్ద ఏ సమస్య వచ్చినా అధికారుల దృష్టికి తీసుకొస్తే వెంటనే పరిష్కరిస్తారని అన్నారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వర రావు, మద్దుల పల్లి మార్కెట్ చైర్మన్ భైరు హరినాథ్ బాబు పాల్గొన్నారు.