నర్సీపట్నం నియోజకవర్గ అభివృద్ధే తన ప్రధాన లక్ష్యమని శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు అన్నారు. సోమవారం నాతవరం మండలంలో గల పెద గొలుగొండ పేట గ్రామంలో నిర్వహించిన పల్లె పండగ పంచాయతీ వారోత్సవాల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా 68 లక్షలతో నిర్మించనున్న పెద గొలుగొండపేట-వెదురుపల్లి గ్రామానికి వెళ్లే రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం స్పీకర్ అయ్యన్నపాత్రుడు మాట్లాడుతూ నర్సీపట్నం నియోజకవర్గ అభివృద్ధే తన లక్ష్యమని, అందుకుగాను నియోజకవర్గానికి 40 కోట్లు నిధులు మంజూరు చేయడం జరిగిందని అన్నారు. నాతవరం మండలానికి గాను డ్రైనేజీలు, సిసి రోడ్లు, బీటీ రోడ్లు గాను సుమారు 14 కోట్లు నిధులు మంజూరు చేయడం జరిగిందని ఆయన అన్నారు. దమ్ము, ధైర్యం వుంటే జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి రావాలని,గత వైసిపి ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా ఇసుకను దోచుకుందని, పంచాయతీలకు నిధులు కేటాయించకుండా భ్రష్ట పట్టించారని ఆయన అన్నారు. గత ప్రభుత్వంలో స్థానిక శాసనసభ్యులు సుమారు రెండు కోట్ల రూపాయలు ఇసుక దందా చేయలేదా అని, ఈయన ఉచిత గురించి మాట్లాడేదని ప్రశ్నించారు.
నర్సీపట్నం అభివృద్ధి కోసం 40 కోట్ల నిధులు
