జి.కొండూరు మండలంలోని భీమవరప్పాడు గ్రామంలో ఇసుక కేంద్రంగా కోట్లాట. ఇసుక ఉచితం కావడంతో గృహనిర్మాణం కోసం వాగులో ఇసుక కోసం వెళ్ళిన వారిపై ఇసుక మాఫియా దౌర్జన్యం, ఇటుక రాళ్ళతో దాడి. పలువురికి గాయాలు, మైలవరం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న భాదితులు. తాము తప్ప వేరొకరు వాగులో ఇసుక తోలడానికి వీల్లేదని ఇసుక మాఫియా నిర్వాహకులు తమపై దాడికి దిగారని వాపోతున్న భాదితులు. అర్థరాత్రి ఇసుక బయటి ప్రాంతాలకు తరలించి సొమ్ము చేసుకుంటున్నారని ఆరోపణ.
భీమవరప్పాడులో ఇసుక మాఫియా దాడి
