వినూత్న రీతిలో ఖాళీ ప్లేట్లు పట్టుకొని ట్రాఫిక్ వద్ద ఆహారమైన పెట్టండి మరమత్తు పనులైన చేపట్టండి లేదా సాలూరు మీదగా అయినా రహదారి సౌకర్యం కల్పించాలని కోరుతూ సోమవారం లారీలు ట్రాఫిక్ వద్ద ఖాళీ ప్లేట్లు పట్టుకొని ఆహారం పెట్టండి రహదారి అయిన మళ్లించండి లేక గోతులు కప్పండి అని కోరుతూ సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో నిరసన
రోడ్లు భవనాల శాఖ అధికారులు కనిపించరు కనీసం పర్యవేక్షణ చేయరు ఇప్పటికే అనేకమంది అధికారులు మారారు తప్ప పరిష్కారం శూన్యం. ఒక్క పోలీస్ సిబ్బంది తప్ప మిగతా అధికారులు ఎవరూ కూడా ఈ రహదారుల గురించి పట్టించుకోని పరిస్థితి. సిపిఎం పార్టీ లారీ అసోసియేషన్ ఆధ్వర్యంలో మిగతా పార్టీలు మరియు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో గోతులు కప్పడం జరిగింది తప్ప రోడ్లు భవనాల శాఖ అధికారులు పని మాత్రం శూన్యం.
గత నాలుగు సంవత్సరాలుగా ఈ రోడ్లు పైన గోతులు కప్పడానికి టెండర్లు వేస్తున్నాం టెండర్లు వేస్తున్నాం అని చెప్పడమే తప్ప టెండర్ లేదు నిధులు లేదు గోతులు కప్పే పరిస్థితి లేదు.
ఒక గంట కాదు రెండు గంటల కాదు 72 గంటల ట్రాఫిక్ లో విద్యార్థులకు చదువు లేవు వైద్యం కోసం వెళ్లడానికి బండే గతి ఇక ఉద్యోగస్తుల పరిస్థితి చెప్పనక్కర్లేదు ఇది మూడు రాష్ట్రాలకు వెళ్లి రహదారి పరిస్థితి.
ఒక్క నెల కాదు రెండు నెలల కాదు గడిచిన నాలుగు సంవత్సరాలుగా ఇదే పరిస్థితి రోడ్ల భవనాల శాఖ అధికారులు టెండర్ టెండర్ అంటూ కాలయాపన తప్ప పరిష్కారం శూన్యం.
గత వైయస్సార్ ప్రభుత్వంలో అన్నిటికీ బొటన్ నొక్కారు తప్ప ఈ రహదారులకి బటన్ నొక్కక పోవడం ఈరోజు ఇది పరిస్థితి
ఇప్పటికైనా టెండర్ తో నిమిత్తం లేకుండా పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ శ్యాం ప్రసాద్ గారు ప్రకటించిన జిల్లాకి 11.705 కోట్లను విడుదల చేసి పార్వతీపురం నుండి కూనేరు మీదుగా మూడు రాష్ట్రాలకు వెళ్లి రహదారి మార్గంలో గోతులను కప్పి అటు వాహన దారులకు ఇటు ప్రయాణికుల ప్రాణాలను కాపాడాలని కోరుతూ ఈరోజు అనగా సోమవారం లారీలు ట్రాఫిక్ వద్ద నుండి సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో చతీష్ ఘడ్,బీహార్ జార్ఖండ్,మధ్యప్రదేశ్,ఒరిస్సా రాష్ట్రాలకు చెందిన లారీ డ్రైవర్లతో కలిసి నిరసన కార్యక్రమం చేయడం జరిగింది.
ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యులు కొల్లి సాంబమూర్తి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం నాయకులు ఉపేంద్ర ఆధ్వర్యంలో లారీ డ్రైవర్లతో కలిసి కాళీ ప్లేట్లు పట్టుకొని నిరసన కార్యక్రమం సోమవారం ఉదయం చేయడం జరిగింది.